బాండ్ సిరీస్ హిస్టరీలోనే ఫస్ట్‌టైమ్
ప్రపంచమంతా తెలిసిన సూపర్‌స్టార్ జేమ్స్‌బాండ్… అతనికి క్లాసూ, మాసూ తేడా తెలీదు… కుల, మత, ప్రాంతీయ భాషా భేదాలు అస్సలుండవ్… తెలిసిందల్లా తన అడ్వెంచర్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం… ఈ అంతర్జాతీయ గూఢాచారి ఈసారి ‘స్పెక్టర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే వెయింటింగ్… రెండు వేల రెండువందల కోట్ల రూపాయల బడ్జెట్‌లో రూపొందిన ‘స్పెక్టర్’ చిత్రం రూపోదించారని సమాచారం. 1962 నుంచి జేమ్స్ బాండ్ ప్రపంచ సినీ అభిమానులకు ఓ వ్యసనంలా తయారయ్యాడు. […]
ప్రపంచమంతా తెలిసిన సూపర్‌స్టార్ జేమ్స్‌బాండ్… అతనికి క్లాసూ, మాసూ తేడా తెలీదు… కుల, మత, ప్రాంతీయ భాషా భేదాలు అస్సలుండవ్… తెలిసిందల్లా తన అడ్వెంచర్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం… ఈ అంతర్జాతీయ గూఢాచారి ఈసారి ‘స్పెక్టర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే వెయింటింగ్… రెండు వేల రెండువందల కోట్ల రూపాయల బడ్జెట్‌లో రూపొందిన ‘స్పెక్టర్’ చిత్రం రూపోదించారని సమాచారం.
1962 నుంచి జేమ్స్ బాండ్ ప్రపంచ సినీ అభిమానులకు ఓ వ్యసనంలా తయారయ్యాడు. వచ్చే నెల 5న విడుదల కానున్న ‘స్పెక్టర్’ ఈ సిరీస్‌లో 24వ సినిమా. ట్రైలర్స్ నుంచే ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. గత చిత్రాలతో పోలిస్తే ‘స్పెక్టర్’లో అంతకుమించిన యాక్షన్ ఉంటుందని అర్థమవుతోంది. జేమ్స్‌బాండ్‌గా డానియల్ క్రెగ్‌కి ఇది నాలుగో సినిమా! ‘ స్కైఫాల్’ని తెరకెక్కించిన శామ్ మెండస్ ‘స్పెక్టర్’నూ తీశాడు..
ఆ అమ్మాయి కోసం
చీకటి సామ్రాజ్యంలో తన అక్రమాలను సాగిస్తూ, ప్రపంచానికి పెనుముప్పులా మారిన స్పెక్టర్ అనే ఉగ్రవాద సంస్థ అంతు చూసే క్రమంలో జేమ్స్‌బాండ్ ఓ అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? అసలా అమ్మాయి ఎవరు? ఆమెను విలన్లు ఎందుకు వెంటాడుతున్నారనేదే మిగతా కథ.
‘స్పెక్టర్’ కోసం కేసు
1962లో వచ్చిన ‘డాక్టర్ నో’, 1965లో వచ్చిన ‘థండర్‌బాల్’ చిత్రాలలో ‘స్పెక్టర్’ ఓ ఉగ్రవాద సంస్థగా కనిపిస్తుంది. 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రంలో కనిపిస్తుంది. అసలు ‘స్పెక్టర్’ యాక్టివిటీ గురించి కెవీ మెక్లోరి అనే స్క్రిప్ట్ రైటర్ తన సినిమా కోసం రాసుకున్నారు. దాన్నే ఇయాన్ ఫ్లెమింగ్ లీగల్ రైట్స్ ఏవీ తీసుకోకుండా ‘థండర్‌బాల్’లో వాడుకున్నారు. అప్పటి నుంచి ఇయాన్ ఫ్లెమింగ్, మెక్లోరీల మధ్య కేసు నడుస్తూనే ఉంది. 2013లో హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మెట్రో గోల్డెన్ మేయర్.. మెక్లోరీతో ఓ ఒప్పందం కుదుర్చుకొని స్పెక్టర్‌కు సంబంధించిన పూర్తి హక్కులను చేజిక్కించుకుంది.
ఓల్డ్ లేడీతో రొమాన్స్
‘స్పెక్టర్’లో జేమ్స్‌బాండ్ 51 ఏళ్ల లేడీతో రొమాన్స్ చేస్తాడు. ఇలా నడివయసు స్త్రీతో జేమ్స్‌బాండ్ ప్రేమ నడపడం బాండ్ సిరీస్ హిస్టరీలోనే ఫస్ట్‌టైమ్. 51 ఏళ్ల ఓల్డ్‌లేడీ పాత్రను మోనికా బెలూసి పోషించగా, బాండ్ గర్ల్‌గా లియా సీదూ నటించారు. మొత్తం మీద ప్రపంచ సినిమా సిరిజ్ లో జేమ్స్ బాండ్ సీరిస్ అత్యధిక ప్రేక్షకదరణ పొందుతూ కంటిన్యూ అవుతుండంటం సినిమా లవర్స్ కు ఓ శుభాసూచికం.