Telugu Global
NEWS

వరంగల్ లో గెలుపు కాదు.. మెజారిటీనే లక్ష్యం

వరంగల్ లోక్ సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పోటీకి సిద్ధమయ్యారు. ఇక బీజేపీ, టీడీపీ అభ్యర్థి ఎంపిక ఇవాళ జరిగే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఈసారైనా గెలవాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2014లో వ‌రంగ‌ల్ ఎంపీగా […]

వరంగల్ లో గెలుపు కాదు.. మెజారిటీనే లక్ష్యం
X

వరంగల్ లోక్ సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పోటీకి సిద్ధమయ్యారు. ఇక బీజేపీ, టీడీపీ అభ్యర్థి ఎంపిక ఇవాళ జరిగే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఈసారైనా గెలవాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
2014లో వ‌రంగ‌ల్ ఎంపీగా పోటీ చేసిన క‌డియం శ్రీహ‌రికి 3 లక్షల 96 వేల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో మెజారిటీ సాధించాలంటే కష్టమేనన్న భావన టీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం చేపడుతున్న మిషన్‌ కాకతీయ, పింఛన్‌, వాటర్‌ గ్రిడ్‌ సహా ప్రాజెక్టులు తమను గెలిపిస్తాయంటున్నారు.
మరోవైపు ప్రతిపక్షాలు కూడా గెలవడం మీద కంటే టీఆర్ఎస్ అభ్యర్థి మెజారిటీ తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మెజార్టీ తగ్గిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ప్రజల్లోకి వెళ్లొచ్చని భావిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నిక గెలుపు కేవలం ఇక్కడికే ఆగదని.. త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా వామపక్షాలన్నీ గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

First Published:  1 Nov 2015 12:42 AM GMT
Next Story