Telugu Global
Others

విజయవాడ బస్‌స్టేషన్‌లో సినిమా థియేటర్లు

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సంక్రాంతి నుంచి ప్రయాణికులకు వెండితెరలు అందుబాటులోకి రానున్నాయి! స్టేషన్‌లోకి బస్సులు వచ్చే ప్లాట్‌ఫామ్‌ల బ్లాక్‌లో రెండు డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో థియేటర్‌లో 134 సీట్లు ఉంటాయి. రూ.1.3 కోట్లతో చేపట్టిన ఈ మినీ డిజిటల్ థియేటర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. గడువులోగా నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి సినిమా ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. టికెట్‌ […]

విజయవాడ బస్‌స్టేషన్‌లో సినిమా థియేటర్లు
X

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సంక్రాంతి నుంచి ప్రయాణికులకు వెండితెరలు అందుబాటులోకి రానున్నాయి! స్టేషన్‌లోకి బస్సులు వచ్చే ప్లాట్‌ఫామ్‌ల బ్లాక్‌లో రెండు డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో థియేటర్‌లో 134 సీట్లు ఉంటాయి. రూ.1.3 కోట్లతో చేపట్టిన ఈ మినీ డిజిటల్ థియేటర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. గడువులోగా నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి సినిమా ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. టికెట్‌ ధర వంద రూపాయలుగా నిర్ణయించవచ్చని చెబుతున్నారు.

First Published:  1 Nov 2015 4:37 PM IST
Next Story