ఎన్నారై అభ్యర్థికే బీజేపీ మొగ్గు!
సెలెబ్రిటీలు, ఎన్నారైలు బీజేపీలో చేరడం కొత్తేం కాదు. త్వరలో జరగనున్న వరంగల్ ఉప ఎన్నికలోనూ అభ్యర్థి ఎంపికలో బీజేపీ ఇదే సూత్రాన్ని మరోసారి అవలంబించబోతుందన్న వార్త ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. తమ వల్లే తెలంగాణ వచ్చిందని ఇటు టీఆ ర్ ఎస్, అటు కాంగ్రెస్ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటూ ఎవరికివారు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ ఓట్లనే నమ్ముకుని, స్థానిక నేతలను కాదని ఎన్నారై అభ్యర్థులపై ఆధారపడి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగనుంది. […]
BY sarvi1 Nov 2015 5:07 AM IST
X
sarvi Updated On: 1 Nov 2015 5:07 AM IST
సెలెబ్రిటీలు, ఎన్నారైలు బీజేపీలో చేరడం కొత్తేం కాదు. త్వరలో జరగనున్న వరంగల్ ఉప ఎన్నికలోనూ అభ్యర్థి ఎంపికలో బీజేపీ ఇదే సూత్రాన్ని మరోసారి అవలంబించబోతుందన్న వార్త ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. తమ వల్లే తెలంగాణ వచ్చిందని ఇటు టీఆ ర్ ఎస్, అటు కాంగ్రెస్ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటూ ఎవరికివారు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ ఓట్లనే నమ్ముకుని, స్థానిక నేతలను కాదని ఎన్నారై అభ్యర్థులపై ఆధారపడి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇక్కడే బీజేపీ వరంగల్ జిల్లా నేతలకు, అధిష్టానానికి మధ్య విభేదాలు పొడసూపుతున్నట్లు సమాచారం.
మమ్మల్ని కాదని బయటివారికా?
వరంగల్‌లో బీజేపీకి ఉన్న పట్టు అంతంతమాత్రమే! 1984లో చందుపట్ల జంగారెడ్డి బీజేపీ నుంచి తొలి ఎంపీ హనుమకొండ నుంచే ఎంపికయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి ఆయనే తొలి బీజేపీ ఎంపీ కావడం ఓ రికార్డు. ఆ సమయంలో కేవలం స్థానికుడు అన్న అభిమానంతో జనం జంగారెడ్డిని ఆదరించారు. ఆ విజయం చరిత్ర పుటల్లో భద్రంగా ఉంది. ఇన్నాళ్లూ కష్టపడ్డ తమను కాదని ఎన్నారైని తీసుకువచ్చి.. ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ఒప్పుకోమని స్థానిక నేతలు కుండ బద్దలు కొడుతున్నారు. అయితే, అభ్యర్థి పోటీకి కావాల్సిన ఖర్చు భరించే శక్తి పార్టీకి లేదని,అందుకే ఎన్నారైలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది. దీంతో ఏం స్థానిక నేతల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి నిర్ణయాలు పార్టీకి చేటు చేస్తాయని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఢిల్లీ నుంచి పాఠం నేర్వని బీజేపీ
ఢిల్లీలో దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని ఉన్నపలంగా కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ 70 స్థానాల్లో కేవలం 3 సీట్లకు పరిమితమైంది. ఆ ఘోర పరాజయం నుంచి బీజేపీ ఎలాంటి పాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ ఓట్లను, ఎన్నారై పెట్టే ఖర్చు మాత్రమే ఓట్లు సంపాదించి పెడతాయన్న ధీమా పనికి రాదని సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కేడర్ సరిగా పనిచేయకుండా.. మొండిగా ముందుకెళితే.. పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేసి కేవలం లక్ష పైచిలుకు ఓట్లకు మాత్రమే సాధించి, మూడోస్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే!
Next Story