నవంబర్ లో దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన
విజయవాడ-హైదరాబాద్ మార్గంలో కనకదుర్గగుడి వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్ పడబోతోంది. నవంబర్‌లో దుర్గగుడి ఫ్లై ఓవర్, రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమం కానుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు సంయుక్తంగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాజెక్ట్ కు మంజూరు చేసిన రూ.460 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసింది. పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టి, వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించాలనే యోచనలో రాష్ట్రం […]

విజయవాడ-హైదరాబాద్ మార్గంలో కనకదుర్గగుడి వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్ పడబోతోంది. నవంబర్‌లో దుర్గగుడి ఫ్లై ఓవర్, రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమం కానుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు సంయుక్తంగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాజెక్ట్ కు మంజూరు చేసిన రూ.460 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసింది. పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టి, వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించాలనే యోచనలో రాష్ట్రం ఉంది. దీనివల్ల శీఘ్రగతిన పనులు పూర్తి చేయవచ్చని భావిస్తోంది.
దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులకు మూడు భారీ నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. సోమా కన్ స్ట్రక్షన్స్, ఎల్ అండ్ టీ, నవయుగ సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి. వాటినుంచి టెక్నికల్ డీటెయిల్స్ స్వీకరించారు. వాటిలో ఏ సంస్థకు ప్రాజెక్టు కేటాయించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు సంస్థలకు రెండు ప్యాకేజీలుగా పనులు అప్పగించే అవకాశం ఉంది.