షేర్ సినిమా రివ్యూ
విడుదల తేదీ : 30 అక్టోబర్ 2015 రేటింగ్. 2/5 దర్శకత్వం : మల్లికార్జున్ నిర్మాత : కొమర వెంకటేష్ సంగీతం : ఎస్ఎస్ తమన్ నటీనటులు : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్.. ఒకే యేడాది రెండు చిత్రాలు రావడం. అల్రేడి కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ఉండటంతో షేర్ సినిమా పై అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. రిలీజ్ కు ముందు విడుదలైన ప్రచార చిత్రాలు అదరహో అనిపించక పోయినా.. […]
విడుదల తేదీ : 30 అక్టోబర్ 2015
రేటింగ్. 2/5
దర్శకత్వం : మల్లికార్జున్
నిర్మాత : కొమర వెంకటేష్
సంగీతం : ఎస్ఎస్ తమన్
నటీనటులు : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్..
ఒకే యేడాది రెండు చిత్రాలు రావడం. అల్రేడి కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ఉండటంతో షేర్ సినిమా పై అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. రిలీజ్ కు ముందు విడుదలైన ప్రచార చిత్రాలు అదరహో అనిపించక పోయినా.. రేసు గుర్రంలా నిలుస్తుంది అనే అంచనాలతో అభిమానులున్నారు. అంతకు మించి నందమూరి నామ సంవత్సరం అని పటాస్ సినిమా రిలీజ్ సమయంలో కళ్యాణ్ రామ్ షేర్ సినిమా సమయంలో ఆశించడంతో.. ఈ చిత్రం పై ఇండస్ట్రీ జనాలు కూడా అంచనాలు బాగానే పెట్టుకున్నారు. మరి అంచనాలతో వచ్చిన షేర్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వసూలు చేస్తుందా..? దుమ్ము లేప గల సత్తా ఉందా..? పటాస్ నుమించి అలరిస్తుందా..? ఆ విశేషాలన్ని రివ్యూలో చూద్దాం…
కథ పరంగా షేర్ కథలోకి వెళితే.. అమ్మ(రోహిణి), నాన్న(రావు రమేష్), తమ్ముడు అజయ్ లతో హ్యాపీగా లైఫ్ ని గడిపే కుర్రాడు మన హీరో గౌతమ్ (కళ్యాణ్ రామ్). స్వతహాగా గౌతమ్ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ చేస్తుంటాడు. గౌతమ్ కి ఉన్న క్వాలిటీ.. తనకి నచ్చింది అంటే దానికోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అలా మన హీరో విలన్ పప్పీ(విక్రంజీత్) చేసుకోవాల్సిన అమ్మాయిని తన ఫ్రెండ్ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పప్పీకి ఏమో తనది అన్నది ఎవడన్నా లాక్కుంటే వాడిది అన్నది పప్పీ లాక్కుంటాడు. ఈ స్వభావం వలన గౌతమ్ భవిష్యత్ లో ప్రేమించినా లేదా పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నాది అని చాలెంజ్ చేస్తాడు.
ఆ తర్వాత మన గౌతమ్ మన హీరోయిన్ నందు(సోనాల్ చౌహాన్) లు ఒకరినొకరు చూసుకొని ప్రేమలో పడతారు. అది తెలుసుకున్న పప్పీ నందుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని నందు వాళ్ళ నాన్న ఎసిపి శరత్(సాయాజీ షిండే)తో డిజిపిని చేస్తానని నందుతో పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. అదే టైంలో గౌతమ్ పప్పీకి సపోర్ట్ గా నిలిచిన నేషనల్ లెవల్ డాన్ అయిన దాదా(ముఖేష్ రుషి)ని టార్గెట్ చేసి వారి మనుషులందర్నీ చంపుకుంటూ వస్తుంటాడు. అసలు గౌతమ్ దాదాని ఎందుకు టార్గెట్ చేసి వారి మనుషుల్ని చంపుకుంటూ వస్తున్నాడు.? గౌతమ్ – దాదాకి మధ్య ఉన్న వైరం ఏమిటి.? అలాగే తను ప్రేమించిన నందు పెళ్లి పప్పీతో ఆపకుండా ఏం చేసాడు.? ఎలా తన ప్రేమని దక్కించుకున్నాడు.? అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన కథ..
ప్లస్ పాయింట్స్ :
‘షేర్’ అనే సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ కళ్యాణ్ రామ్ చేసిన పెర్ఫార్మన్స్. సినిమా మొదట నుంచి చివరి దాకా వన్ మాన్ ఆర్మీలా కళ్యాణ్ రామ్ తన భుజాల మీద నడిపించాడు. గౌతమ్ అనే పాత్రలో చాలా బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్ లో లవర్ బాయ్ గా కూడా కనిపించి యవతను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బాగా రిస్క్ తీసుకొని ట్రై చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. సింప్లీ చెప్పాలంటే షేర్ అనేది కళ్యాణ్ రామ్ వన్ మాన్ షో మీద నడిచే సినిమా.. ఇక గ్లామర్ డాల్ సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్. అలాగే సోనాల్ కి ఇచ్చిన పాత్రకి న్యాయం చేస్తూనే అల్ట్రా మోడ్రన్ లుక్ లో ఫుల్ గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది.
ఇక సినిమా పరంగా హైలైట్స్ అనే పాయింట్స్ విషయానికి వస్తే.. సినిమా మొదటి 20 నిమిషాలు చాలా బాగుంటుంది. కళ్యాణ్ రామ్ పై వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది. అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్ బాగుంది. అలాగే సెకండాఫ్ చివరి 30 నిమిషాలలో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. హైవేపై షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. 30 ఇయర్స్ పృధ్వీ చెప్పిన పంచ్ డైలాగ్స్ కొన్ని బాగానే పేలాయి. మిగిలిన నటీనటుల్లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ పరంగా రావు రమేష్, రోహిణిలు ఎమోషనల్ గా మంచి ఫీల్ ని తెచ్చారు. విక్రంజీత్ పాత్రలో సీరియస్ కంటే కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ముఖేష్ రుషి మెయిన్ విలన్ గా ఓకే అనిపించాడు. సినిమాని రెండు గంటల్లోపే ముగించేయడం కూడా సినిమాకి కాస్త హెల్ప్ అవుతుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. సినిమా కథ.. ఇది చాలా పాత కథ. ఒక్క మాటలో చెప్పాలి అంటే నెలలో ఒకసారి అయినా ఇలాంటి కథని మనం చూస్తూనే ఉంటాం. అంత రొటీన్ కథ. దానిని కథనంలో మేనేజ్ చేస్తూ ఎంటర్టైనింగ్ గా చెప్పాలి అనుకున్నాడు డైరెక్టర్ మల్లికార్జున్. అనుకున్న దాని ప్రకారమే ట్విస్ట్ ని లాస్ట్ కి పెట్టుకొని ఆసక్తిని క్రియేట్ చేసాడు కానీ జరిగిన తప్పు ఏంటి అంటే తను ఎంటర్టైన్మెంట్ కోసం రాసుకున్న బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ ఎపిసోడ్స్ అంతగా పేలలేదు. అందువలన ఈ ఎపిసోడ్స్ సినిమాని స్లో చేసేయ్యడమే కాకుండా బోరింగ్ గా కూడా మారుస్తుంది. కథనం లో మిస్టేక్స్ ఉండడమే కాకుండా నేరేషన్ అనేది స్పీడ్ గా లేకపోవడం మరో మేజర్ మైనస్.
పాత చింతకాయి పచ్చిడి లాంటి కథ, స్క్రీన్ ప్లే పై పట్టు లేక పోవడంతో.. తేలిపోయింది. యాక్షన్ చిత్రాలంటే కథ రోటిన్ గానే వుంటుంది. ఒక ఫిక్స్ డ్ పార్మూళా తోనే చేస్తారు. అయితే దర్శకుడి ప్రతిభ అంతా కథను నడపడంలోనే వుంటుంది. ఈ విషయంలో షేర్ సినిమా దర్శకుడు మళ్లీ .. ఘరోంగా ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్ మరీ స్లో గా ఉండటం సినిమాకు మైనస్ పాయింట్. గతంలో కళ్యాణ్ రామ్ తో కత్తి చిత్రం చేసిన ఈ దర్శకుడు.. షేర్ చిత్రంతో కూడా నిరాశ పరిచినట్లే మరి. దర్శకుడ కథనం పై పట్టు బిగించి వుంటే .. పటాస్ ను మించిన హిట్ అయ్యే లక్షణాలు షేర్ చిత్రానికి వున్నాయి.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ పరంగా షేర్ సినిమాకి హెల్ప్ అయిన పాయింట్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ. ఆయన అందించిన విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, అలాగే కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ లను చాలా స్టైలిష్ గా చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎస్ఎస్ తమన్..షేర్ పాటలు కొన్ని బాగున్నాయి, కానీ పిక్చరైజేషన్ పరంగా అన్నీ చాలా బాగున్నాయి. పాటలను పక్కన పెడితే తమన్ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ కి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఇక కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కొన్ని సీన్స్ లో సూపర్బ్ అనుకునేలా ఉన్నా చాలా సీన్స్ లో సాగదీసేస్తున్నారు బాబోయ్ అనుకునేలా ఉంటుంది. డైమండ్ రత్నబాబు డైలాగ్స్ ఓకే అనేలా ఉన్నాయి. అలాగే రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కళ్యాణ్ రామ్ బాడీ లాంగేవేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.
‘పటాస్’ లాంటి సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన ‘షేర్’ అనే సినిమా ఆ స్థాయిలో మెప్పించలేకపోయినా పరవాలేధనిపించుకుంది. కళ్యాణ్ రామ్ వన్ మాన్ ఆర్మీ పెర్ఫార్మన్స్ వలన ఈ సినిమాలో చాలా అంశాలు మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ పై కంపోజ్ చేసిన మూడు యాక్షన్ ఎపిసోడ్స్ షేర్ సినిమాకి హైలైట్ అయ్యాయి. సినిమా స్టార్టింగ్ మరియు సినిమా ముగింపు చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాకపోవడం, కథ -కథనం చాలా రొటీన్ గా అనిపించడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఓవరాల్ గా షేర్ అనే సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి చూడచ్చు.