పోలీసుల ఆశ్రయంలో గాయని మధుప్రియ!
ప్రముఖ సింగర్ మధుప్రియ ప్రేమ పెళ్లి చేసుకోబోతోందన్న వార్త సంచలనంగా మారింది. కొద్ది రోజులుగా మధు ప్రియ ఇంట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. మధుప్రియ శ్రీకాంత్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. అయితే తల్లిదండ్రులు, ఇతర బంధువులు లవ్ మ్యారేజ్ వద్దని ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఇంకా కొంతకాలం ఆగాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మధు ప్రియ మాత్రం శ్రీకాంత్ ఇంట్లోనే నాలుగు రోజులుగా ఉంటోందని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి […]
BY sarvi29 Oct 2015 11:30 PM IST
X
sarvi Updated On: 30 Oct 2015 11:58 AM IST
ప్రముఖ సింగర్ మధుప్రియ ప్రేమ పెళ్లి చేసుకోబోతోందన్న వార్త సంచలనంగా మారింది. కొద్ది రోజులుగా మధు ప్రియ ఇంట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. మధుప్రియ శ్రీకాంత్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. అయితే తల్లిదండ్రులు, ఇతర బంధువులు లవ్ మ్యారేజ్ వద్దని ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఇంకా కొంతకాలం ఆగాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మధు ప్రియ మాత్రం శ్రీకాంత్ ఇంట్లోనే నాలుగు రోజులుగా ఉంటోందని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి అర్థరాత్రి సమయంలో కాగజ్ నగర్ వచ్చారు.
అయితే మధుప్రియను ఆమె బంధువులే కొందరు ప్రియుడు శ్రీకాంత్ బారి నుంచి తప్పించడానికి ప్రయత్నించారన్ప ప్రచారం జరిగింది. దీంతో మధుప్రియ ప్రియుడు శ్రీకాంత్ తో కలిసి కాగజ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిచారు. వీరికి, వారిద్దరికీ కూడా పోలీసులు కౌన్సెలింగ్ చేస్తున్నారు. కాగజ్ నగర్ పోలీసులు కూడా ఇద్దరూ తమ సమక్షంలోనే ఉన్నట్టు ధృవీకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన బంగి శ్రీకాంత్తో మధుప్రియకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య రెండున్నరేళ్లుగా ప్రేమవ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇవాళే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Next Story