Telugu Global
Others

వైసీపీ వాళ్లకు జేసీయే పెద్ద దిక్కు అయ్యారా..?

అనంతపురం జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డే ఇప్పుడు అనంతపురం జిల్లాలో వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన చిన్నచిన్న నేతలకు, కార్యకర్తలకు పెద్ద దిక్కుగా మారారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు జిల్లావాసులు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని చోట్ల వైసీపీ , కాంగ్రెస్‌కు చెందిన నేతలకు పోలీసుల వేధింపులు తప్పడం లేదు. తప్పు ఎవరిదన్నది కూడా చూడకుండా ప్రతిపక్షాలకు చెందిన తమపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ, కాంగ్రెస్‌కు […]

వైసీపీ వాళ్లకు జేసీయే పెద్ద దిక్కు అయ్యారా..?
X

అనంతపురం జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డే ఇప్పుడు అనంతపురం జిల్లాలో వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన చిన్నచిన్న నేతలకు, కార్యకర్తలకు పెద్ద దిక్కుగా మారారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు జిల్లావాసులు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని చోట్ల వైసీపీ , కాంగ్రెస్‌కు చెందిన నేతలకు పోలీసుల వేధింపులు తప్పడం లేదు. తప్పు ఎవరిదన్నది కూడా చూడకుండా ప్రతిపక్షాలకు చెందిన తమపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన వారు వాపోతున్నారు. దీంతో పోలీసుల బాధలను తట్టుకోలేక అలాంటి వారంతా జేసీ దివాకర్ రెడ్డిని ఆశ్రయిస్తున్నారట.

వైసీపీ వాళ్లకు మేం ఎలా సాయం చేయగలమని జేసీ బ్రదర్స్ తొలుత నిష్టూరమాడుతున్నారు, అయితే గతంలో అందరూ కాంగ్రెస్‌లోనే కలిసి పనిచేసిన వారు కావడంతో ఆ విషయాన్ని గుర్తు చేసి జేసీని మొహమాటపెడుతున్నారట సదరు పోలీస్ బాధిత వ్యక్తులు. తొలుత బెట్టు చేసినా తర్వాత మాత్రం జేసీ బ్రదర్స్ తనకు చేతనైన మేర వారికి సాయం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేపథ్యంలో మరీ కఠినంగా కాకుండా, టీడీపీ శ్రేణుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మధ్యేమార్గంగా సమస్యను పరిష్కరించి పంపుతున్నారట జేసీ బ్రదర్స్.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన వారు కూడా దివాకర్ రెడ్డి ఎంపీగా గెలవడమే తమకు మంచిదైందని అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో జేసీ కూడా లేకుంటే తమకు మరిన్ని ఇబ్బందులు వచ్చేవని చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భంగా ఇలాంటి విషయాల్లో జేసీ బ్రదర్స్ సంకట పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ, కాంగ్రెస్ వారికి సాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే జేసీ గురించి తెలిసిన వారు మాత్రం ఆయనన్ను జిల్లాలో ఒక పార్టీ నేతగా కన్నా సొంత స్టామినా ఉన్న లీడర్‌గానే చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

First Published:  30 Oct 2015 3:08 PM IST
Next Story