జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ బదిలీ
తెలంగాణ రాష్ట్ర సమితికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఎంతో కాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జీహెచ్‌ఎంసీ) సోమేష్‌కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయన్ని గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా చిరంజీవులును నియమించారు. ఈయన ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరితోపాటు తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొత్తగా బి. జనార్ధనరెడ్డిని నియమించారు. శాలిని […]
తెలంగాణ రాష్ట్ర సమితికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఎంతో కాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జీహెచ్‌ఎంసీ) సోమేష్‌కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయన్ని గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా చిరంజీవులును నియమించారు. ఈయన ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరితోపాటు తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొత్తగా బి. జనార్ధనరెడ్డిని నియమించారు. శాలిని మిశ్రాను సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేశారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్విగా ఎస్పీ సింగ్‌ను, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజేష్ తివారిని, సీసీఎల్‌ఏగా రేమండ్ పీటర్‌ను, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ చద్దాను, అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా వికాస్ రాజ్