విమానంలో మంటలు... 15 మందికి గాయాలు
ఫోర్లిడాలోని ఫోర్డ్ లాడర్‌డేల్ విమానాశ్రయం నుంచి పైకి ఎగురుతున్న ఓ విమానంలో మంటలు చెలరేగి పదిహేను మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెనిజులా వెళ్ళాల్సిన బొయింగ్ 767 విమానంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. విమానం రన్‌వే టేకాప్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించిన ఆ సమయంలో విమానంలో 101 మంది ప్రయాణికులున్నారని, నిజానికి […]

ఫోర్లిడాలోని ఫోర్డ్ లాడర్‌డేల్ విమానాశ్రయం నుంచి పైకి ఎగురుతున్న ఓ విమానంలో మంటలు చెలరేగి పదిహేను మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెనిజులా వెళ్ళాల్సిన బొయింగ్ 767 విమానంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. విమానం రన్‌వే టేకాప్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించిన ఆ సమయంలో విమానంలో 101 మంది ప్రయాణికులున్నారని, నిజానికి పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని సంబంధిత విమాన వర్గాలు తెలిపాయి.