త్వరలో దావూద్ ఖతం..?
మాఫియా డాన్ దావూద్ కు రోజులు దగ్గర పడ్డాయా? అతడిని మట్టుబెట్టేందుకే మరో మాఫియా డాన్ చోటారాజన్ లొంగిపోయాడా? ఇంతకాలం చోటారాజన్‌కు పరోక్షంగా సహకరిస్తూ వచ్చిన భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కు ఇంత సులువుగా అతను చిక్కబోతున్నాడంటే.. నమ్మశక్యంగా లేదు. దీని వెనక భారీ వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రపంచంలో దావూద్ ఇబ్రహీం కాస్తో.. కూస్తో.. భయపడేది ఒక రాజన్ గ్యాంగ్ కు మాత్రమే! గతంలో పాకిస్తాన్‌లో తలదాచుకున్న […]
BY sarvi28 Oct 2015 11:38 PM GMT
X
sarvi Updated On: 29 Oct 2015 11:26 PM GMT
మాఫియా డాన్ దావూద్ కు రోజులు దగ్గర పడ్డాయా? అతడిని మట్టుబెట్టేందుకే మరో మాఫియా డాన్ చోటారాజన్ లొంగిపోయాడా? ఇంతకాలం చోటారాజన్‌కు పరోక్షంగా సహకరిస్తూ వచ్చిన భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కు ఇంత సులువుగా అతను చిక్కబోతున్నాడంటే.. నమ్మశక్యంగా లేదు. దీని వెనక భారీ వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రపంచంలో దావూద్ ఇబ్రహీం కాస్తో.. కూస్తో.. భయపడేది ఒక రాజన్ గ్యాంగ్ కు మాత్రమే! గతంలో పాకిస్తాన్‌లో తలదాచుకున్న దావూద్‌పై తన మనుషులతో రెండు, మూడు సార్లు అటాక్ చేయించాడు రాజన్. ‘శత్రువు కు శత్రువు మనకు మిత్రుడు’ అన్న కోణంలో ‘రా’ కూడా ఈ దాడులకు సహకారం అందించిందని వార్తలు వచ్చాయి. అయితే అవి విజయవంతం కాలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ( ఐ. ఎస్. ఐ) రక్షణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య దర్జాగా బతుకుతున్నాడు దావూద్. మరి అలాంటపుడు రాజన్ అనుచరులు ఎలా దావూద్ ను చంపుతారు?
లొంగుబాటు వ్యూహాత్మకమే!
ఒకప్పుడు ప్రాణస్నేహితుల్లా మెదిలిన దావూద్ ఇబ్రహీం – చోటా రాజన్‌లు కాలక్రమంలో బద్ధ శత్రువులుగా మారారు. 1993లో దావూద్ పాకిస్తాన్‌తో చేతులు కలిపి ముంబై పేలుళ్లకు పాల్పడటంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇండియాలో ఉంటే తన ప్రాణాలకు హాని ఉందని తెలిసి రాజన్ దుబాయ్ పారిపోయాడు. ఇక అక్కడ నుంచి రెండు గ్యాంగులు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. 2000 సెప్టెంబర్‌లో బ్యాంకాక్‌లో దావూద్ మనుషులు చేసిన దాడిలో రాజన్ తృటిలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి దావూద్ మనుషులను చంపుతూ వస్తున్నాడు రాజన్. ఇప్పుడు ఈ లొంగుబాటు వెనక భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) హస్తముందని, ముందా ‘రా’ తో మాట్లాడాకే రాజన్ లొంగిపోయాడని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎలా చంపుతారు?
దావూద్ ఇబ్రహీం అంత కాకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా రాజన్ కు సైతం నెట్‌వర్క్ ఉంది. ఇతని వద్ద కూడా షార్ప్ షూటర్లు చాలామందే ఉన్నారు. ఏ దేశంలోనైనా మాఫియాలో షార్ప్ షూటర్లకు డిమాండ్ ఎక్కువ. వారిలో కొందరిని ఎలాగైనా పాకిస్తాన్ లోని క్వెట్టాలో ఉంటున్న దావూద్‌ను కనిపెట్టి చంపాలన్నది భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) వ్యూహమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దావూద్ పాస్‌పోర్టు, ఇళ్ల చిరునామాలు, ఫోన్ నెంబర్లతో సహ ‘రా’ బయటపెట్టిన సంగతి తెలిసిందే!
ఇకపోతే.. రాజన్‌పై ఉన్న కేసులు ఎప్పుడో… రెండు దశాబ్దాల క్రితం నాటివి. అవి కోర్టులో నిరూపితమయ్యే అవకాశాలు దాదాపు తక్కువ. అంతా అనుకున్నట్లుగా జరిగి.. దావూద్ చనిపోతే.. రాజన్ కోరిక, భారత్ కోరిక రెండూ తీరతాయి. ఇదే వారి మధ్య జరిగిన ఒప్పందం అయి ఉంటుందని పలువురు మేథావులు భావిస్తున్నారు.
Next Story