Telugu Global
Cinema & Entertainment

స‌మంత‌కు అదొక్క‌టే త‌క్కువ‌

కత్తి సినిమాతో హిట్టయితే కొట్టింది కానీ అందులో హీరోయిన్‌ పాత్రకి అస్సలు ప్రాధాన్యత లేకపోవడంతో తమిళంలో సమంతకంటూ ఏ గుర్తింపూ రాలేదింకా. విక్రమ్‌తో చేసిన ’10 ఎండ్రతుకుల్ల’ చిత్రంతో తమిళనాడులో జెండా పాతేస్తానని సమంత భావించింది. ఈ చిత్రంలో చాలా ఇంట్రెస్టింగ్‌ రోల్‌ చేసిన సమంతకి పేరు కూడా బాగానే వచ్చింది. కానీ విక్రమ్‌ నుంచి ఈ చిత్రం ఊహించని డిజాస్టర్‌ అయి బయ్యర్లకి చుక్కలు చూపిస్తోంది. ఎలాగైనా హిట్‌ కొట్టేస్తాననే సమంత కలలన్నీ ఆవిరైపోయి ఆమెకి […]

స‌మంత‌కు అదొక్క‌టే త‌క్కువ‌
X

కత్తి సినిమాతో హిట్టయితే కొట్టింది కానీ అందులో హీరోయిన్‌ పాత్రకి అస్సలు ప్రాధాన్యత లేకపోవడంతో తమిళంలో సమంతకంటూ ఏ గుర్తింపూ రాలేదింకా. విక్రమ్‌తో చేసిన ’10 ఎండ్రతుకుల్ల’ చిత్రంతో తమిళనాడులో జెండా పాతేస్తానని సమంత భావించింది. ఈ చిత్రంలో చాలా ఇంట్రెస్టింగ్‌ రోల్‌ చేసిన సమంతకి పేరు కూడా బాగానే వచ్చింది. కానీ విక్రమ్‌ నుంచి ఈ చిత్రం ఊహించని డిజాస్టర్‌ అయి బయ్యర్లకి చుక్కలు చూపిస్తోంది. ఎలాగైనా హిట్‌ కొట్టేస్తాననే సమంత కలలన్నీ ఆవిరైపోయి ఆమెకి ఏడుపు మాత్రమే మిగిలిందంటున్నారు ప‌రిశీల‌కులు.
ఈమధ్య తాను చేస్తున్న సినిమాలన్నీ వరుసగా టపా కట్టేస్తున్నాయి. సన్నాఫ్‌ సత్యమూర్తి గుడ్డిలో మెల్లగా ఆడినా కానీ సమంతకి ఒరిగిందేమీ లేదు. లక్కీగా ఇతర హీరోయిన్లు బిజీగా వుండి మహేష్‌తో బ్రహ్మోత్సవం చేస్తోంది కానీ లేదంటే ఇప్పుడు తగిలిన ఈ సినిమా దెబ్బకి ఆమె కుదేలైపోయేదే. మహేష్‌తో హ్యాట్రిక్‌ హిట్స్‌ ఇచ్చి గాడిన పడాలని చూస్తోన్న సమంత కెరియర్‌ ఇప్పుడు సంకట స్థితిలో పడ్డట్టే. ఇంతకాలం లక్కీ హ్యాండ్‌ అనిపించుకోవడం వల్ల వచ్చిన అవకాశాలు ఇక ఆమెని వెతుక్కుంటూ రావడం లేదు కనుక ఇప్పుడు హిట్‌ కొట్టకపోతే పెద్ద సినిమాలపై సమంత ఇక ఆశలు వదిలేసుకోవచ్చు. ఫ్యాన్స్ మాత్రం..ఒక మంచి హిట్ ప‌డితే స‌మంత బౌన్స్ బ్యాక్ అయిన‌ట్లే అంటున్నారు. త‌క్కువ టైమ్ లో ఎక్కువ మంది స్టార్ హీరోల‌తో న‌టించిన ఘ‌న‌త స‌మంత‌దే అని చెప్పాలి. గ్లామ‌ర్ కోణంలో ఇప్ప‌టి వ‌ర‌కు నెట్టుకొచ్చిన స‌ము బేబి.. న‌టిగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైమ్ న‌డుస్తుంది అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం గ్లామ‌ర్ కోసం స‌మంత ను చూడ‌రు కాబ‌ట్టి..త‌న‌కు గ్లామ‌ర్ తో పాటు..యాక్టింగ్ కు స్కోప్ ఉండే రోల్ ఎప్ప‌టికి ప‌డుతుందో.. అప్ప‌టి వ‌ర‌కు స‌మంత‌కు కొంత టైఫ్ టైమే అంటున్నారు క్రిటిక్స్.

First Published:  29 Oct 2015 12:37 AM IST
Next Story