రూ. 5కే భోజనం... కేంద్రం ప్రారంభం
పేదలకు ఒక్కపూటైనా కడుపు నింపాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు రూపాయలకే భోజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హరేరామ-హరేకృష్ణ పౌండేషన్ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన ఈ పథకాన్ని లక్డీకాపూల్ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పౌండేషన్ ప్రతినిధి సత్య గౌరవ్‌లు ప్రారంభించారు. భోజనం నాణ్యతలో రాజీ లేకుండా ఐదు రూపాయలకే అందజేస్తామని, విద్యార్థులతోపాటు పలువురు […]
పేదలకు ఒక్కపూటైనా కడుపు నింపాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు రూపాయలకే భోజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హరేరామ-హరేకృష్ణ పౌండేషన్ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన ఈ పథకాన్ని లక్డీకాపూల్ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పౌండేషన్ ప్రతినిధి సత్య గౌరవ్‌లు ప్రారంభించారు. భోజనం నాణ్యతలో రాజీ లేకుండా ఐదు రూపాయలకే అందజేస్తామని, విద్యార్థులతోపాటు పలువురు ఈ భోజనాన్ని చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని మంత్రి తలసాని అన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ భోజనామృత కార్యక్రమానికి వచ్చే స్పందన చూసి మరో వంద కేంద్రాల్ని ప్రారంభించాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. పేదలకు, విద్యార్థులకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.