శీను వైట్ల పై 10 కోట్ల నష్ట పరిహారం..?
ఒక హిట్ జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక ఫట్ ఒక తుఫాన్ కు కారణం అవుతుంది. రాంచరణ్ తో చేసిన బ్రూస్ లీ చిత్రం దర్శకుడు శీను వైట్ల పాలిటి శాపంగా మారింది. ఈ సినిమాకు ముందు కెరీర్ పరమైన అభిప్రాయ బేదాల తో విడిపోయినా కోన వెంకట్ , శీను వైట్ల ను.. రాంచరణ్ తన ప్రాజెక్ట్ కోసం ఇద్దర్ని కలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఈ నెల 16 రిలీజ్ కావడం […]
ఒక హిట్ జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక ఫట్ ఒక తుఫాన్ కు కారణం అవుతుంది. రాంచరణ్ తో చేసిన బ్రూస్ లీ చిత్రం దర్శకుడు శీను వైట్ల పాలిటి శాపంగా మారింది. ఈ సినిమాకు ముందు కెరీర్ పరమైన అభిప్రాయ బేదాల తో విడిపోయినా కోన వెంకట్ , శీను వైట్ల ను.. రాంచరణ్ తన ప్రాజెక్ట్ కోసం ఇద్దర్ని కలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఈ నెల 16 రిలీజ్ కావడం డిజాస్టార్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. సినిమాకు ప్రాణంగా నిలవ వలసిన సెకండాఫ్ దారుణంగా వుండటంతో ఈ చిత్రం కనీసం మెగా ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయింది.
అయితే ఈ చిత్రంలో కథ రచయిత గా కోన వెంకట్ పేరును వేయడంతో .. కోన వెంకట్ .. శీను వైట్ల పై ఏకంగా హై కోర్టు లో తను పేరును, ప్రతిష్టను భంగపరిచినందకు దాదాపు 10 కోట్లు నష్టపరిహాం కావాలంటూ కేసు పెట్టే డానికి హైకోర్టుకు సంబంధించిన అడ్వేకేట్స్ ను కలుస్తున్నాడని కోన సన్నిహితులు సమాచారం. ఒక రచయిత తను పేరు ను వాడుకున్నందకు కేసు ఫైల్ చేయడం ఇదే ప్రధమం అని తెలుస్తుంది. వాస్తవంగా కోన వెంకట్ ఇచ్చిన కథ వేరు.. దాని దాదాపు 90 శాతం మార్పులు చేర్పులు చేసి కోన వెంకట్ సినిమా చేశారంటున్నారు కోన . అందుకే తను ఇచ్చిన ఒరిజినల్ స్క్రిప్ట్ ను ఇంటర్నేట్ లో అప్ లోడ్ చేసే ఆలోచన చేస్తున్నారట. మొత్తం మీద దర్శకుడు శీను వైట్లకు కష్టకాలమే నడుస్తుంది. ఈ మధ్యనే భార్యను వ్యక్తి గతంగా దూషించారంటూ అది పోలీసుల కేసు వరకు వెళ్లి సద్దుమణిగింది. వెంటనే బ్రూస్ లీ రూపంలో కోన వెంకట్ బాణం ఎక్కు పెట్టడం మరో తలనొప్పి. చివరకు ఈ వ్యవహారం ఎలా ఎండ్ అవుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.