Telugu Global
Others

తాజ్‌ కారిడార్‌ కేసులో కేసీఆర్‌కు సీబీఐ ఉచ్చు!

కేంద్రమంత్రిగా కేసీఆర్‌ అధికార దుర్వినియోగంపై సీబీఐ దృష్టి సారించింది. తాజ్ కారిడార్ కుంభకోణం కేసులో ఆయన ఓ నిందితుడికి అనుకూలంగా వ్యవహరించి నిబంధనలు తుంగలోకి తొక్కారని సీబీఐ భావిస్తోంది. తాజ్‌ కారిడార్‌ కేసులో ఉన్న ఓ నిందితుడికి నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి హోదాలో కె. చంద్రశేఖరరావు విఆర్ఎస్ మంజూరు చేశారని తెలిసింది. తాజ్ కారిడార్‌ కేసులో మాయావతి సోదరుడు, కార్మిక శాఖ డైరెక్టర్ సిద్ధార్థ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మాయావతి ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్ కార్మికశాఖ […]

తాజ్‌ కారిడార్‌ కేసులో కేసీఆర్‌కు సీబీఐ ఉచ్చు!
X

కేంద్రమంత్రిగా కేసీఆర్‌ అధికార దుర్వినియోగంపై సీబీఐ దృష్టి సారించింది. తాజ్ కారిడార్ కుంభకోణం కేసులో ఆయన ఓ నిందితుడికి అనుకూలంగా వ్యవహరించి నిబంధనలు తుంగలోకి తొక్కారని సీబీఐ భావిస్తోంది. తాజ్‌ కారిడార్‌ కేసులో ఉన్న ఓ నిందితుడికి నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి హోదాలో కె. చంద్రశేఖరరావు విఆర్ఎస్ మంజూరు చేశారని తెలిసింది. తాజ్ కారిడార్‌ కేసులో మాయావతి సోదరుడు, కార్మిక శాఖ డైరెక్టర్ సిద్ధార్థ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మాయావతి ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్ కార్మికశాఖ కార్యదర్శి సాహ్ని తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదని సీబీఐ పేర్కొంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సీబీఐ ఫిర్యాదు చేసినా కేసీఆర్ పట్టించుకోకుండా విచారణ పెండింగ్‌లో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా 2004 మే 22న సిద్ధార్థ్‌కు విఆర్ఎస్ ఇచ్చారు. కార్మికశాఖ కార్యదర్శి సాహ్ని ఎంత చెప్పినా వినకుండా కేసీఆర్, సీబీఐ కేసులను భూతద్ధంలో చూడొద్దని ఆయనకే సలహా ఇచ్చారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమే కాక కేంద్రమంత్రిగా తనకున్న అధికారాలను కేసీఆర్‌ దుర్వినియోగం చేయడమేనని సీబీఐ పేర్కొంది. అందుకే ఇపుడు కేసీఆర్‌పై సీబీఐ దృష్టి సారించింది.

First Published:  29 Oct 2015 5:58 PM IST
Next Story