తెలంగాణ అభివృద్ధికి సాయపడండి: కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. హైకోర్టు విభజనసహా పలు కీలకఅంశాలన్నీ పెండింగ్‌లో ఉండటం వల్ల ఆచరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే దృష్టి పెట్టి వీటిని పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను కోరారు. హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయమంత్రి సదానందగౌడ లోక్‌సభలోనే స్పష్టమైన హామీ ఇచ్చారని, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వీలైనంత త్వరలో ప్రక్రియ పూర్తవుతుందని […]
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. హైకోర్టు విభజనసహా పలు కీలకఅంశాలన్నీ పెండింగ్‌లో ఉండటం వల్ల ఆచరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే దృష్టి పెట్టి వీటిని పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను కోరారు. హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయమంత్రి సదానందగౌడ లోక్‌సభలోనే స్పష్టమైన హామీ ఇచ్చారని, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వీలైనంత త్వరలో ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చారు. హైకోర్టు విభజన విషయమై గతంలో ప్రధాని సహా పలువురు మంత్రులకు చేసిన విజ్ఞప్తులను కేసీఆర్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు గుర్తుచేశారు. హైకోర్టు విభజన జరుగక తలెత్తుతున్న ఇబ్బందులను వివరించారు.
పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయదలచామని, ఇందుకు కొత్త ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు అవరమవుతారని, వీరిని పెంచాలని కోరారు. ఉన్నవారు కూడా సరిపోవడం లేదని రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నదని, ఇందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, అదనపు ఎస్పీ తదితర పోస్టులకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవసరమవుతారని రాజ్‌నాథ్‌కు తెలిపారు.
రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్నదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ వివరించారు. కనుక రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కూడా కలిశారు. డిసెంబర్ 23 నుంచి నిర్వహించనున్న ఆయుత మహా చండీయాగానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.