Telugu Global
Cinema & Entertainment

శ్రీనువైట్ల దంపతుల మధ్య అసలు ఏం జరిగింది..?

ఎంతో అన్యోన్యమైన జంట అది. ప్రతి ఫంక్షన్ లో కలివిడిగా కనిపించేవారు. సినిమాల్లో కూడా భర్త శ్రీనువైట్లకు తోడ్పాటు అందించేది రూపవైట్ల. కానీ ఒకేసారి ఆ కుటుంబంలో మనస్పర్థలు పెరిగిపోయాయి. ఏకంగా తన భర్తపై రూపవైట్ల పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది మేటర్. తర్వాత కేసును ఆమె ఉపసంహరించుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి తెరవెనక కారణాలు ఏమై ఉంటాయనే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరీ ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న శ్రీనువైట్ల, తన […]

శ్రీనువైట్ల దంపతుల మధ్య అసలు ఏం జరిగింది..?
X
ఎంతో అన్యోన్యమైన జంట అది. ప్రతి ఫంక్షన్ లో కలివిడిగా కనిపించేవారు. సినిమాల్లో కూడా భర్త శ్రీనువైట్లకు తోడ్పాటు అందించేది రూపవైట్ల. కానీ ఒకేసారి ఆ కుటుంబంలో మనస్పర్థలు పెరిగిపోయాయి. ఏకంగా తన భర్తపై రూపవైట్ల పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది మేటర్. తర్వాత కేసును ఆమె ఉపసంహరించుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి తెరవెనక కారణాలు ఏమై ఉంటాయనే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరీ ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న శ్రీనువైట్ల, తన భార్యపై చేయిచేసుకున్నాడనే పుకారులో ఎంత వరకు నిజముందనేది ఇండస్ట్రీలో తొలిచేస్తున్న ప్రశ్న. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. శ్రీనువైట్ల-రూపవైట్ల మధ్య గొడవకు కారణం కేవలం ఆర్థిక కారణాలే అని సమాచారం. ఆగడు, బ్రూస్ లీ రూపంలో రెండు ఫ్లాప్స్ రావడంతో.. భార్యభర్తల మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగిందని అంటున్నారు. ఇది కూడా కేవలం పుకారు మాత్రమే. అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే భార్యాభర్తల్లో ఒకరు నోరు విప్పాల్సిందే.
First Published:  28 Oct 2015 12:37 AM IST
Next Story