బాహుబలి కాదు.. వీరబలి
మొన్నటివరకు ప్రభాస్ అందరికీ బాహుబలి. కానీ ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు మాత్రం అతడు వీరబలిగా మారాడు. అవును.. వీరబలి కోసం తమిళ తంబీలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మేటర్ ఏంటంటే.. బాహుబలి సినిమా తమిళనాట ఘనవిజయం సాధించింది. ప్రభాస్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఇదే ఊపులో ప్రభాస్ మేనియాకు క్యాష్ చేసుకునేందుకు కొందరు తమిళ నిర్మాతలు.. అతడు నటించిన రెబల్ సినిమా డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. ఆ సినిమాను తమిళ్ లోకి డబ్ చేసి […]
BY sarvi28 Oct 2015 12:38 AM IST

X
sarvi Updated On: 29 Oct 2015 4:10 AM IST
మొన్నటివరకు ప్రభాస్ అందరికీ బాహుబలి. కానీ ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు మాత్రం అతడు వీరబలిగా మారాడు. అవును.. వీరబలి కోసం తమిళ తంబీలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మేటర్ ఏంటంటే.. బాహుబలి సినిమా తమిళనాట ఘనవిజయం సాధించింది. ప్రభాస్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఇదే ఊపులో ప్రభాస్ మేనియాకు క్యాష్ చేసుకునేందుకు కొందరు తమిళ నిర్మాతలు.. అతడు నటించిన రెబల్ సినిమా డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. ఆ సినిమాను తమిళ్ లోకి డబ్ చేసి వీరబలి పేరుతో త్వరలోనే విడుదల చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాహుబలిలో ప్రభాస్ తో ఆడిపాడిన తమన్న.. రెబల్ లో కూడా ఉండడంతో.. వీరబలి సినిమా కచ్చితంగా హిట్టవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వీరబలి టైటిల్ తో.. ప్రభాస్-తమన్న ఫొటోలతో తమిళనాట పోస్టర్లు వెలిశాయి. మరి బాహుబలి ఎఫెక్ట్ వీరబలికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
Next Story