Telugu Global
NEWS

ఇలాగైతే రాజీనామా చేస్తా: రాయపాటి

నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశిరావుకు ప్రభుత్వ తీరుపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క పని కూడా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాజీనామా చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లా పరిషత్ హాల్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనే ఎంపీ రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ”ప్రజలకు సంబంధించిన పనులు కావడం లేదు. అధికారులకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకునేవారే లేరు. పరిస్థితి ఇలాగే ఉంటే […]

ఇలాగైతే రాజీనామా చేస్తా: రాయపాటి
X

నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశిరావుకు ప్రభుత్వ తీరుపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క పని కూడా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాజీనామా చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లా పరిషత్ హాల్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనే ఎంపీ రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.

”ప్రజలకు సంబంధించిన పనులు కావడం లేదు. అధికారులకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకునేవారే లేరు. పరిస్థితి ఇలాగే ఉంటే రాజీనామా చేస్తా ” అంటూ పుల్లారావు ముందే తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తాగేందుకు నీరు కూడా లేవని… ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తానే సొంతంగా ట్యాంకర్లు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. కనీసం మీరైనా పట్టించుకోని సమస్యలు పరిష్కరించడని మంత్రి పుల్లారావును ఎంపీ కోరారు.

ఎంపీ ఇలా ఒక్కసారిగా ఓపెన్ అయిపోయే సరికి మంత్రితోపాటు అధికారులు కూడా అవాక్కయ్యారు.జోక్యం చేసుకున్న పుల్లారావు వెంటనే ఎంపీ చెప్పిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆ మధ్య విజయవాడ అధికార పార్టీ ఎంపీ కేశినేని నాని కూడా ప్రభుత్వ తీరుపై ఇలాగే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారు.

First Published:  28 Oct 2015 1:22 AM IST
Next Story