Telugu Global
Cinema & Entertainment

సినిమాల పైరసీ కోసం 200 వెబ్‌సైట్లు

తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ పెనుభూతంలా వెంటాడుతోంది. చిన్న పెద్ద అన్న సంబంధం లేకుండా సినిమా రిలీజైన గంటల్లోనే బొమ్మ ఇంటర్‌నెట్ ప్రత్యక్షమవుతోంది. ఈ నేపథ్యంలో పైరసీ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ సినీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. భేటీకి ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, పోలీసు , ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు… సినిమాల పైరసీ కోసం 200 వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. పోలీసులు, ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, సినీ […]

సినిమాల పైరసీ కోసం 200 వెబ్‌సైట్లు
X

తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ పెనుభూతంలా వెంటాడుతోంది. చిన్న పెద్ద అన్న సంబంధం లేకుండా సినిమా రిలీజైన గంటల్లోనే బొమ్మ ఇంటర్‌నెట్ ప్రత్యక్షమవుతోంది. ఈ నేపథ్యంలో పైరసీ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ సినీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. భేటీకి ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, పోలీసు , ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు… సినిమాల పైరసీ కోసం 200 వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. పోలీసులు, ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, సినీ పరిశ్రమ వర్గాలు కలిస్తే పైరసీని అరికట్టొచ్చు. పైరసీ కారణంగా గడిచిన 9 నెలల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు రూ. 350 కోట్ల నష్టం వాటిల్లినట్లు సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  28 Oct 2015 10:24 AM IST
Next Story