Telugu Global
NEWS

బంజారాహిల్స్‌లో టీటీడీ బాలాజీ టెంపుల్‌

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నిర్ణయించింది. తిరుపతిలో వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రికి ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ ఆస్పత్రిని వందకోట్లతో ఏడాదిలో పూర్తి చేయాలని టీటీడీ తీర్మానించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 12.1 కోట్లతో పాలకొనుగోళ్లు జరపాలని, 1.54 కోట్లతో మిరియాలు కొనుగోళ్లు జరపాలన్న నిర్ణయానికి టీటీడీ సభ్యులు ఆమోదం తెలిపారు. నవంబర్ మొదటివారంలో తిరుపతిలో ప్రత్యేక […]

బంజారాహిల్స్‌లో టీటీడీ బాలాజీ టెంపుల్‌
X

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నిర్ణయించింది. తిరుపతిలో వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రికి ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ ఆస్పత్రిని వందకోట్లతో ఏడాదిలో పూర్తి చేయాలని టీటీడీ తీర్మానించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 12.1 కోట్లతో పాలకొనుగోళ్లు జరపాలని, 1.54 కోట్లతో మిరియాలు కొనుగోళ్లు జరపాలన్న నిర్ణయానికి టీటీడీ సభ్యులు ఆమోదం తెలిపారు. నవంబర్ మొదటివారంలో తిరుపతిలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. ప్రసాదం, సేవా టిక్కెట్ల ధరల పెంపుపై అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేశారు. లతామంగేష్కర్ పాడిన వెంకటేశ్వర కీర్తనల సిడిలను ఢిల్లీలో ఇరవై వేలు పంచి పెట్టాలని నిర్ణయించారు. ఎపి తెలంగాణల్లోని అన్ని టిటిడి కళ్యాణ మండపాలను ఎసిలుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి ప్రకటించారు.

First Published:  27 Oct 2015 5:41 PM IST
Next Story