Telugu Global
Others

భూకంపం... పాక్‌, ఆఫ్ఘన్‌లో 270 మంది దుర్మరణం

దక్షిణాసియాను తీవ్ర భూకంపం కుదిపివేసింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రకృతి వైపరీత్యానికి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ అతలాకుతలమయ్యాయి. వేల సంఖ్యలో భవనాలు, ఇళ్ళు కుప్ప కూలాయి. భయకంపితులైన జనం ఇళ్ళు, కార్యాలయాలు వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ రెండు దేశాల్లో సుమారు 270 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తున్నది. పాక్‌లో 200 మంది, ఆఫ్ఘన్‌లో 70 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంటుందని వార్తలు […]

భూకంపం... పాక్‌, ఆఫ్ఘన్‌లో 270 మంది దుర్మరణం
X

దక్షిణాసియాను తీవ్ర భూకంపం కుదిపివేసింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రకృతి వైపరీత్యానికి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ అతలాకుతలమయ్యాయి. వేల సంఖ్యలో భవనాలు, ఇళ్ళు కుప్ప కూలాయి. భయకంపితులైన జనం ఇళ్ళు, కార్యాలయాలు వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ రెండు దేశాల్లో సుమారు 270 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తున్నది. పాక్‌లో 200 మంది, ఆఫ్ఘన్‌లో 70 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. శిథిలాల తొలగింపు మొదలైతే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ర్టాల్లోనూ ప్రకంపనలు వచ్చినా పెద్దగా ఆస్తి, ప్రాణనష్టాలు చోటు చేసుకోలేదని తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. అయితే పాక్ భూకంపాల అధ్యయన కేంద్రం మాత్రం భూకంప తీవ్రతను 8.1గా పేర్కొన్నది. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అన్నిరకాల సాయం అందించడానికి సిద్ధమన్నారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో కూడా మోదీ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామన్నారు. పాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల్లోనూ భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

ఉత్తర భారతాన్ని ఊపేసిన భూకంపం

earchqueఉత్తర భారతదేశం మరోసారి భూకంపంతో వణికిపోయింది. భూమి కంపించడాన్ని గమనించిన జనం ఇళ్ళను వదిలి భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ముందు కొన్ని క్షణాలపాటు ఏం జరుగుతుందో ఊహించని జనం గత అనుభవాలు కొన్ని సెకన్లలోనే జ్ఞప్తికి రావడంతో భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ, కాశ్మీర్‌ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని హింద్‌కుష్‌ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. భూ కంపం వల్ల భూ ప్రకంపనలు ఐదు నిమషాలపాటు సంభవించాయి. ఇంకా హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌ల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై ఈ ప్రకంపనల తీవ్రత 7.5గా నమోదైంది. దాదాపు ఐదు నిమషాలపాటు భూమి కంపించడంతో జనం వణికి పోయారు.

First Published:  27 Oct 2015 3:00 AM IST
Next Story