ప్రేమ వార్త నిజమే.. పెళ్ళి వార్త నిజం కాదు...
తన పెళ్లికి సంబంధించి తాజాగా వచ్చిన వార్తల్ని అసిన్ ఖండించింది. నవంబర్ 27న ఆమె పెళ్లి చేసుకోనుందనే వార్తల్లో నిజం లేదని కన్ ఫర్మ్ చేసింది. అసలు ఈ ఏడాదే పెళ్లి చేసుకోనని కుండబద్దలు కొట్టింది అసిన్. ప్రస్తుతం తనకు వ్యాపారపరంగా, సినిమాల పరంగా కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయని, అవన్నీ పూర్తవ్వడానికి ఈ ఏడాది పడుతుందని చెప్పుకొచ్చింది అసిన్. కాబట్టి 2015లో పెళ్లి ఆలోచన లేదని, వచ్చే ఏడాది ఓ మంచి తేదీ ఫిక్స్ చేేసే […]
BY sarvi27 Oct 2015 12:37 AM IST

X
sarvi Updated On: 27 Oct 2015 5:12 AM IST
తన పెళ్లికి సంబంధించి తాజాగా వచ్చిన వార్తల్ని అసిన్ ఖండించింది. నవంబర్ 27న ఆమె పెళ్లి చేసుకోనుందనే వార్తల్లో నిజం లేదని కన్ ఫర్మ్ చేసింది. అసలు ఈ ఏడాదే పెళ్లి చేసుకోనని కుండబద్దలు కొట్టింది అసిన్. ప్రస్తుతం తనకు వ్యాపారపరంగా, సినిమాల పరంగా కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయని, అవన్నీ పూర్తవ్వడానికి ఈ ఏడాది పడుతుందని చెప్పుకొచ్చింది అసిన్. కాబట్టి 2015లో పెళ్లి ఆలోచన లేదని, వచ్చే ఏడాది ఓ మంచి తేదీ ఫిక్స్ చేేసే ఆలోచనలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే సేమ్ టైం, తన లవ్ ఎఫైర్ ను మాత్రం కన్ ఫర్మ్ చేసింది. మైక్రోమ్యాక్స్ సీఈవోతో ప్రేమాయణం నిజమేనని చెప్పింది. ప్రస్తుతం తామిద్దరం పీకల్లోతు ప్రేమలో ఉన్నామని, త్వరలోనే వీలుచూసుకొని వెడ్డింగ్ షాపింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్తామని స్పష్టంచేసింది అసిన్. తాజాగా వచ్చిన రూమర్లపై మాట్లాడుతూ.. పెళ్లి ఢిల్లీలో మాత్రం ఉండదని స్పష్టంచేసింది. కుదిరితే ముంబయిలోనే వివాహం చేసుకుంటామని చెప్పుకొచ్చింది అసిన్.
Next Story