కొన్నవి కాదు... కొట్టుకొచ్చిన తుపాకులు 10 వేలు
అది పోలీసులు ఆయుధాలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూం కాదు… పోనీ వేల కొద్దీ ఆయుధాలు ఉండే మిలిటరీ స్థావరం కాదు. అక్కడున్న తుపాకులు పదో… వందో కాదు… వేలు… అంటే ఒకటో రెండో కాదు… ఏకంగా పదివేలు. అవి కూడా కొని నిల్వ చేసినవి కాదు… వీలు చిక్కినప్పుడల్లా ఎత్తుకొచ్చి దాచి పెట్టినవి. అది కూడా బయట ఎక్కడో కాదు… ఇంట్లో దాచుకున్నాడతను. ఆ ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు తుపాకులు ఒక్కొక్కటి తీస్తుంటే లెక్క […]
అది పోలీసులు ఆయుధాలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూం కాదు… పోనీ వేల కొద్దీ ఆయుధాలు ఉండే మిలిటరీ స్థావరం కాదు. అక్కడున్న తుపాకులు పదో… వందో కాదు… వేలు… అంటే ఒకటో రెండో కాదు… ఏకంగా పదివేలు. అవి కూడా కొని నిల్వ చేసినవి కాదు… వీలు చిక్కినప్పుడల్లా ఎత్తుకొచ్చి దాచి పెట్టినవి. అది కూడా బయట ఎక్కడో కాదు… ఇంట్లో దాచుకున్నాడతను. ఆ ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు తుపాకులు ఒక్కొక్కటి తీస్తుంటే లెక్క పెట్టే లేక ఓ దశలో అలసిపోయారు. ఇంట్లో ఉన్న గ్యారేజ్ నుంచి తీస్తున్న కొద్దీ ట్రాక్టర్లు నిండిపోయాయి కాని ఎక్కడా తగ్గినట్టు కనిపించడం లేదు. తీస్తూనే మొత్తం లెక్క పెడుతున్నా ఎక్కడో లెక్క తప్పింది… మళ్ళీ మొదటికొచ్చింది. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పేజ్‌ల్యాండ్ సిటీలో 51 ఏళ్ల బ్రెంట్ నికోల్సన్ ఇంటి నుంచి ఇలా స్వాధీనం చేసుకున్న తుపాకులు పదివేలు పైనే. రెండోసారి కూడా లెక్క తప్పిన తర్వాత ఇక ఓపిక లేక పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. బ్రెంట్ ఇంట్లో సుమారు ఎనిమిది నుంచి పది వేల వరకు తుపాకులు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు అన్వేషణ మొదలు పెట్టారు. స్వాధీనం చేసుకున్న తుపాకుల్లో ఎక్కువ శాతం దొంగలించినవేనని అధికారులు భావిస్తున్నారు. సుమారు మూడు రోజులుపాటు పోలీసులు నికోల్సన్ ఇంటిపై దాడులు చేశారు. దొంగలించిన సొత్తు విలువ ఏడు కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.