Telugu Global
Cinema & Entertainment

శ్రీనువైట్లపై ఫిర్యాదు వెనక్కు తీసుకున్న భార్య

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను భర్త శ్రీనువైట్ల నిత్యం వేధిస్తున్నారంటూ సంతోష రూప వారం క్రితం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనువైట్లపై 498/A, 323A సెక్షన్ల కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. శ్రీనువైట్ల ఫ్రస్టేషన్‌లో నిత్యం తనను వేధిస్తున్నాడని, శారీరకంగానూ హింసిస్తున్నారని సంతోష రూప పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించారు. పోలీసులు చర్యలు మొదలుపెట్టేలోగానే కొందరు టాలీవుడ్ ప్రముఖులు రంగంలోకి దిగి […]

శ్రీనువైట్లపై ఫిర్యాదు వెనక్కు తీసుకున్న భార్య
X

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను భర్త శ్రీనువైట్ల నిత్యం వేధిస్తున్నారంటూ సంతోష రూప వారం క్రితం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో శ్రీనువైట్లపై 498/A, 323A సెక్షన్ల కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. శ్రీనువైట్ల ఫ్రస్టేషన్‌లో నిత్యం తనను వేధిస్తున్నాడని, శారీరకంగానూ హింసిస్తున్నారని సంతోష రూప పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించారు.

పోలీసులు చర్యలు మొదలుపెట్టేలోగానే కొందరు టాలీవుడ్ ప్రముఖులు రంగంలోకి దిగి భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో సంతోష తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. శ్రీనువైట్ల, సంతోష రూపది ప్రేమ వివాహం. పెళ్లికి మధ్యవర్తిత్వం వహించిన టాలీవుడ్ పెద్దలే కేసు విషయంలోనూ రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది.

First Published:  26 Oct 2015 4:33 PM IST
Next Story