మతాన్ని మైమరపించిన మానవత్వం
ఓ వైపు దేశంలో రాజకీయ నేతలు మతం పేరుతో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతుంటే… అందుకు విరుద్ధంగా ముస్లిం మహిళకు జరిగిన సంఘటనతో మతం కంటే మానవత్వం గొప్పదని మరోసారి రుజువయ్యింది. వివరాలను పరిశీలిస్తే… ముంబయి నగరంలో నివసించే ఇలియాజ్ షేక్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ట్యాక్సీని అద్దెకు తీసుకుని ఆస్పత్రికి బయల్తేరారు. అయితే మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ట్యాక్సీ డ్రైవర్ దించి వేశాడు. ఈ స్థితిలో ఏం […]
BY sarvi26 Oct 2015 4:36 AM IST

X
sarvi Updated On: 26 Oct 2015 5:38 AM IST
ఓ వైపు దేశంలో రాజకీయ నేతలు మతం పేరుతో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతుంటే… అందుకు విరుద్ధంగా ముస్లిం మహిళకు జరిగిన సంఘటనతో మతం కంటే మానవత్వం గొప్పదని మరోసారి రుజువయ్యింది. వివరాలను పరిశీలిస్తే… ముంబయి నగరంలో నివసించే ఇలియాజ్ షేక్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ట్యాక్సీని అద్దెకు తీసుకుని ఆస్పత్రికి బయల్తేరారు. అయితే మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ట్యాక్సీ డ్రైవర్ దించి వేశాడు. ఈ స్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇలియాజ్ షేక్ తన భార్యను రోడ్డు పక్కనే వినాయకుడి గుడి వద్ద దించి మరో ట్యాక్సీ కోసం వెతకడానికి బయల్దేరాడు. భార్య నూర్‌జహాన్ పరిస్థితిని గుడి దగ్గర ఉన్న మహిళలు గ్రహించి గుడి దగ్గర్లో నివాసముంటున్న మహిళలు ముందుకొచ్చి పరుపులు, చీరలు తెచ్చి గుడి లోపల ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. ఈనేపథ్యంలో ఆ గుడి శిశువు అరుపులతో మార్మోగింది. అప్పుడు తేరుకున్న నూర్‌జహాన్ తనకు గుడిలోనే ప్రసవం అయ్యిందని గుర్తించింది. తాను మార్గమధ్యంలో ట్యాక్సీ దిగేటప్పటికే దగ్గర్లో ఉన్న గుడి ఉన్నట్టు గుర్తించింది. ఆ సమయంలోనే దేవుడు తనను, తన కడుపులో ఉన్న శిశువును కాపాడాలని మనసులో అనుకున్నానని, అలాగే జరగడం దైవ కృప అని ఆమె తెలిపారు. ఆ భగవంతుని సన్నిధిలో జన్మించిన తన బిడ్డకు గణేశ్ అని పేరు పెడుతున్నామని ఆ భార్యాభర్తలు నూర్జహాన్, ఇలియాజ్ షేక్ తెలిపారు.
Next Story