Telugu Global
Others

మదరిండియాకు గీత

ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చేశాయి. కన్నవారికి దూరంగా దేశంకాని దేశంలో అనాధలా బతుకుతున్న గీత జీవితంలో నూతన శకం ఆరంభమైంది. ఇవాళ గీత పాకిస్థాన్ నుంచి ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ లో భారత విదేశాంగ శాఖ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. గీత వెంట పాక్ కు చెందిన ఈధీ ఫౌండేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే గీత కుటుంబ సభ్యులుగా భావిస్తున్న బీహారీ […]

మదరిండియాకు గీత
X

ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చేశాయి. కన్నవారికి దూరంగా దేశంకాని దేశంలో అనాధలా బతుకుతున్న గీత జీవితంలో నూతన శకం ఆరంభమైంది. ఇవాళ గీత పాకిస్థాన్ నుంచి ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ లో భారత విదేశాంగ శాఖ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. గీత వెంట పాక్ కు చెందిన ఈధీ ఫౌండేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఇప్పటికే గీత కుటుంబ సభ్యులుగా భావిస్తున్న బీహారీ తల్లిదండ్రుల నుంచి అధికారులు డీఎన్ఏ టెస్ట్ ల కోసం శాంపిల్స్ ను సేకరించారు. బీహార్ లోని సహర్స జిల్లాకు చెందిన జనార్దన్ మహతో గీత తండ్రిగా భావిస్తున్నారు. డిఎన్ఎ పరీక్ష తర్వాత గీతను తండ్రికి అప్పగిస్తారు. అప్పటివరకూ ఓ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో గీత ఉంటుంది.
పదేళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్ వెళ్లే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలెక్కిన గీత లాహోర్ చేరింది. బధిరురాలైన గీతను అక్కడ పాకిస్తాన్ సైనికులు గమనించి ఈధీ ఫౌండేషన్‌కు అప్పగించారు. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్‌ కథతో గీత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్లకు సొంత వాళ్లను కలవనుండడంపై గీత ఆతృతగా ఎదురుచూస్తోంది. గీతను ఇంతకాలం పోషించిన ఐదుగురు ఈధీ సంస్థ ప్రతినిధులను కూడా భారత్‌కు ఆహ్వానించారు. తన తల్లిదండ్రులను కలుసుకునే అవకాశం రావడానికి కారకుడైన సల్మాన్ను కలవాలని గీత ఆశపడుతోంది.

First Published:  26 Oct 2015 6:21 AM IST
Next Story