పోలీసులను టార్గెట్ చేసిన చంద్రబాబు?
ఏపీలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ప్రతిపక్షాలను అణచివేసేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తోందంటూ ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్న వేళ చంద్రబాబు మరో వివాదానికి తెరలేపారు. గడిచిన ఐదేళ్లలో పోలీస్ అధికారుల వ్యవహారశైలిపై వివరాలు సేకరించి నివేదిక అందించాలని డీజీపీ, ఐజీ స్థాయి అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. మరో ఐదు నెలల్లోగా పోలీస్ ఉన్నతాధికారులకు సంబంధించిన గత ఐదేళ్ల ట్రాక్ రికార్డును సమర్పించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంపై పలువురు […]
ఏపీలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ప్రతిపక్షాలను అణచివేసేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తోందంటూ ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్న వేళ చంద్రబాబు మరో వివాదానికి తెరలేపారు. గడిచిన ఐదేళ్లలో పోలీస్ అధికారుల వ్యవహారశైలిపై వివరాలు సేకరించి నివేదిక అందించాలని డీజీపీ, ఐజీ స్థాయి అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. మరో ఐదు నెలల్లోగా పోలీస్ ఉన్నతాధికారులకు సంబంధించిన గత ఐదేళ్ల ట్రాక్ రికార్డును సమర్పించాలని ఆదేశించారు.
ఈ నిర్ణయంపై పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2009 నుంచి 2014 వరకు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి సహకరించని వారిని టార్గెట్ చేసేందుకే ట్రాక్ రికార్డు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా కాంగ్రెస్ హయాంలో ఎక్కడైనా టీడీపీ వారిపై చర్యలు తీసుకున్న పోలీసు అధికారులను ఇబ్బంది పెట్టడమే ట్రాక్ రికార్డు ఉద్దేశమని ఆందోళన చెందుతున్నారు. పోలీసులపై రాజకీయ ముద్రవేసి డిపార్ట్‌మెంట్‌లో చీలిక తెచ్చే ప్రమాదకర ప్రయత్నం జరుగుతోందని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి చర్యలు ఒకసారి మొదలుపెడితే భవిష్యత్తులోనూ ఆగకుండా కొనసాగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్‌కు, వైసీపీకి సన్నిహితులుగా ఉన్న పోలీస్ అధికారుల వివరాలు సేకరించి, వారిని పక్కన పెట్టేందుకు చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులను భయపెట్టి కీలుబొమ్మలుగా మార్చుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నాయి.