మిల్కీ బ్యూటీపై కన్నేసిన కమల్
కుర్రహీరోలతో సమానంగా శరవేగంగా సినిమాలు చేస్తున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. చీకటి రాజ్యం సినిమాను రికార్డు టైమ్ లో పూర్తిచేసిన ఈ సీనియర్ మోస్ట్ నటుడు.. ఇప్పుడు మరోసినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. చీకటి రాజ్యం సినిమాను డైరక్ట్ చేసిన రాజేష్ అనే కుర్ర దర్శకుడికే నెక్ట్స్ సినిమా ఛాన్స్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. సీనియర్ దర్శకుడు మౌళి రాసిన కథను.. డెవలప్ చేయమని రాజేశ్ కు అప్పజెప్పాడు. కమల్ ఆదేశాల మేరకు స్క్రీన్ […]
BY admin25 Oct 2015 10:42 AM IST
X
admin Updated On: 25 Oct 2015 10:44 AM IST
కుర్రహీరోలతో సమానంగా శరవేగంగా సినిమాలు చేస్తున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. చీకటి రాజ్యం సినిమాను రికార్డు టైమ్ లో పూర్తిచేసిన ఈ సీనియర్ మోస్ట్ నటుడు.. ఇప్పుడు మరోసినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. చీకటి రాజ్యం సినిమాను డైరక్ట్ చేసిన రాజేష్ అనే కుర్ర దర్శకుడికే నెక్ట్స్ సినిమా ఛాన్స్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. సీనియర్ దర్శకుడు మౌళి రాసిన కథను.. డెవలప్ చేయమని రాజేశ్ కు అప్పజెప్పాడు. కమల్ ఆదేశాల మేరకు స్క్రీన్ ప్లేను దాదాపు సగం పూర్తిచేశాడట రాజేష్. ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ ఏంటంటే.. ఇందులో హీరోయిన్ గా తమన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఓ సందర్భంలో కమల్ హాసన్ ను కలిసి తమన్నా..అతనితో కలిసి నటించాలనే కోరికను బయటపెట్టింది. పైగా తమన్నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన శృతిహాసన్ కూడా తండ్రికి రికమండేషన్ చేయడంతో.. లోకనాయకుడి నెక్ట్స్ సినిమాలో మిల్కీ బ్యూటీ దాదాపు కన్ ఫర్మ్ అయిపోయినట్టే. చీకటి రాజ్యం థియేటర్లలోకి వచ్చిన తర్వాత కొత్త సినిమాపై మరింత క్లారిటీ వస్తుంది.
Next Story