వరంగల్ బరిలో బీజేపీ?
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలపై టీడీపీ బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్‌లో రెండు పార్టీల ముఖ్య నేతలు దాదాపు మూడు గంటల పాటు సమావేశమై చర్చించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించారు. అభ్యర్ధిని నిలిపే అవకాశం బీజేపీకే దక్కే చాన్స్ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్డీయే అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో […]
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలపై టీడీపీ బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్‌లో రెండు పార్టీల ముఖ్య నేతలు దాదాపు మూడు గంటల పాటు సమావేశమై చర్చించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించారు. అభ్యర్ధిని నిలిపే అవకాశం బీజేపీకే దక్కే చాన్స్ ఉంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్డీయే అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో గెలిచే సామర్ధ్యం కాంగ్రెస్‌కు లేదన్నారు. పోటీ టీఆర్‌ఎస్ – బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి మధ్యే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన ఫాంహౌజ్‌కు పరిమితమైందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. ఉమ్మడి అధ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని రమణ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే… ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.