యాగానికి సిద్ధమైన కేసీఆర్- ఈ టైమ్‌లో ఎందుకు?
మరోసారి చండీయాగం నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లాలోని ఫాం హౌజ్‌లో ఈ యాగం నిర్వహించనున్నారు. యాగానికి రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు తనను ఆహ్వానించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును యాగానికి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. దాదాపు ఐదు వేల మంది పురోహితులతో ఈ ఆయుత చండీయాగం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు యాగం నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ […]
మరోసారి చండీయాగం నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లాలోని ఫాం హౌజ్‌లో ఈ యాగం నిర్వహించనున్నారు. యాగానికి రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు తనను ఆహ్వానించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును యాగానికి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
దాదాపు ఐదు వేల మంది పురోహితులతో ఈ ఆయుత చండీయాగం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు యాగం నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల ఎదురవుతున్న సమస్యలు, ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణ కుంభకోణంలో కేసీఆర్‌ను సీబీఐ విచారించిన నేపథ్యంలో అంతా మంచి జరగాలన్నది కూడా యాగం ఉద్దేశమని తెలుస్తోంది.