రేవంత్, ఎర్రబెల్లి మధ్య తీవ్ర వాగ్వాదం
టీటీడీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. చాలా కాలంగా నిప్పుఉప్పులా ఉంటున్న రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోసారి నేరుగా తలపడ్డారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికపై చర్చించేందుకు శనివారం ఉదయం టీటీడీపీ నేతల భేటీ ఎర్రబెల్లి, రేవంత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరంగల్ స్థానాన్ని బీజేపీకి వదిలిపెట్టాలా లేక టీడీపీ అభ్యర్థినే నిలపాలా అన్న దానిపై నేతలు సమావేశమై చర్చించారు. ఈ సమయంలో రేవంత్, ఎర్రబెల్లి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. ఈ సమయంలో ఇద్దరు నేతలు […]
టీటీడీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. చాలా కాలంగా నిప్పుఉప్పులా ఉంటున్న రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోసారి నేరుగా తలపడ్డారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికపై చర్చించేందుకు శనివారం ఉదయం టీటీడీపీ నేతల భేటీ ఎర్రబెల్లి, రేవంత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
వరంగల్ స్థానాన్ని బీజేపీకి వదిలిపెట్టాలా లేక టీడీపీ అభ్యర్థినే నిలపాలా అన్న దానిపై నేతలు సమావేశమై చర్చించారు. ఈ సమయంలో రేవంత్, ఎర్రబెల్లి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. ఈ సమయంలో ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ వాగ్వాదం సమయంలో రేవంత్ ఒంటరైనట్టు సమాచారం. మిగిలిన సీనియర్ నేతలంతా రేవంత్ తీరును తప్పుపట్టారు. దుకూడు తగ్గించుకోవాలని హితవు పలికారు.
సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసు వల్ల పార్టీని ఎన్నడూ లేని స్థాయిలో నష్టం జరిగిందని రేవంత్‌పై సీనియర్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యక్తిగత ప్రతిష్టకోసం పాకులాడడం మానుకుని, దుకూడు తగ్గించుకోవాలని రేవంత్‌కు క్లాస్ పీకారు. టీటీడీపీ భేటీ అనంతరం నేతలు బీజేపీ నేతలతో కలిసి చర్చించారు. రెండు పార్టీల సంయుక్త సమావేశంలో రేవంత్ మౌనంగా ఉండిపోయినట్టు సమాచారం.