Telugu Global
National

పప్పుల ధరల పెరుగుదలకు రాష్ట్రాలదే బాధ్యత: జైట్లీ

దేశంలో కందిపప్పు ధర మండిపోవడానికి రాష్ట్రాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్రాలు విస్మరించాయని, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి వెంట బడిన తర్వాత మాత్రమే మూడు నాలుగు రోజులుగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రాలు ఇలా చేసిన 3,290 దాడులలో ఏకంగా 36 వేల టన్నుల అక్రమ నిల్వలు బయటపడ్డాయని తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని జైట్లీ తెలిపారు. […]

పప్పుల ధరల పెరుగుదలకు రాష్ట్రాలదే బాధ్యత: జైట్లీ
X

దేశంలో కందిపప్పు ధర మండిపోవడానికి రాష్ట్రాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్రాలు విస్మరించాయని, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి వెంట బడిన తర్వాత మాత్రమే మూడు నాలుగు రోజులుగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రాలు ఇలా చేసిన 3,290 దాడులలో ఏకంగా 36 వేల టన్నుల అక్రమ నిల్వలు బయటపడ్డాయని తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని జైట్లీ తెలిపారు. తెలంగాణలో 2,546 టన్నులు, ఏపీలో 859, ఛత్తీస్‌గఢ్‌లో 4,525, మధ్యప్రదేశ్‌లో 2,295, హర్యానాలో 1,168, కర్ణాటకలో 479 టన్నులసహా మొత్తం 36 వేల టన్నుల నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కందిపప్పు కష్టాలు 15 రోజుల్లో తీరుతాయని ఆయన భరోసా ఇచ్చారు. దిగుమతి చేసుకున్న పప్పుదినుసులలో 5 వేల టన్నులు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని, మరో 3 వేల టన్నులు రానున్నాయని తెలిపారు. కేంద్రం ఇస్తున్న పప్పుదినుసులను తమిళనాడు అత్యధికంగా తీసుకెళ్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానంలో ఉందన్నారు. కందిసాగు ఎక్కువగా సాగే మలావీ, మొజాంబిక్‌, మయన్మార్‌ తదితర దేశాల్లోనూ దిగుబడులు తగ్గడం వల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగాయని తెలిపారు.

First Published:  22 Oct 2015 6:32 PM IST
Next Story