కండోమ్స్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
కండోమ్స్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ ఆధారిటీ( NPPA) కండోమ్స్ ధరలపై నియంత్రణ విధించడాన్ని తప్పుపట్టింది. ఇటీవల అత్యవసర ఔషధాల కేటగిరిలో కండోమ్స్‌ను కూడా చేర్చి వాటి ధరలు ఒక స్థాయికి మించి ఉండకుండా NPPA నియంత్రణ విధించింది. దీన్ని సవాల్ చేస్తూ చెన్నైకు చెందిన TTK ప్రొడెక్టివ్ డివైజెస్ లిమిటెడ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన కోర్టు కంపెనీ వాదనతో ఏకీభవించింది. తాము నూతన ప్రయోగాలతో కొత్తరకం కండోమ్స్‌ను […]
కండోమ్స్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ ఆధారిటీ( NPPA) కండోమ్స్ ధరలపై నియంత్రణ విధించడాన్ని తప్పుపట్టింది. ఇటీవల అత్యవసర ఔషధాల కేటగిరిలో కండోమ్స్‌ను కూడా చేర్చి వాటి ధరలు ఒక స్థాయికి మించి ఉండకుండా NPPA నియంత్రణ విధించింది. దీన్ని సవాల్ చేస్తూ చెన్నైకు చెందిన TTK ప్రొడెక్టివ్ డివైజెస్ లిమిటెడ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన కోర్టు కంపెనీ వాదనతో ఏకీభవించింది.
తాము నూతన ప్రయోగాలతో కొత్తరకం కండోమ్స్‌ను సృష్టిస్తున్నామని అలాంటప్పుడు వాటి ధరపై నియంత్రణ విధించడం సరికాదని కంపెనీ వాదించింది. ఇలా ధర నియంత్రణ విధించడం ఉత్పత్తి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టుకు విన్నవించింది. అయితే కండోమ్ నేటి సమాజంలో అత్యతవసర వస్తువుగా మారిందని కాబట్టి దాని ధర అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. చివరకు కోర్టు కండోమ్‌ను ఔషదాల కింద గుర్తించలేమని స్పష్టం చేసింది. కండోమ్స్ ధరలపై NPPA ఉత్తర్వులు సరికాదని తేల్చిచెప్పింది. గతంలో ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏకీభవించింది.