సిక్స్ ప్యాక్ కోసం చెర్రీ ప్రయత్నం
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు రామ్ చరణ్. తమిళ్ లో హిట్టయిన ఓ మూవీకి రీమేక్ గా ఇది రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా హక్కుల్ని 5 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనిమీదే సురేందర్, చెర్రీ కలిసి పనిచేస్తున్నారు. తెలుగు నేటివిటీకి, చెర్రీ బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టు కథలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు యాక్షన్ స్టోరీ కావడంతో ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు […]
BY sarvi23 Oct 2015 12:34 AM IST
X
sarvi Updated On: 23 Oct 2015 6:32 AM IST
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు రామ్ చరణ్. తమిళ్ లో హిట్టయిన ఓ మూవీకి రీమేక్ గా ఇది రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా హక్కుల్ని 5 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనిమీదే సురేందర్, చెర్రీ కలిసి పనిచేస్తున్నారు. తెలుగు నేటివిటీకి, చెర్రీ బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టు కథలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు యాక్షన్ స్టోరీ కావడంతో ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు చరణ్. జనరల్ గా చెర్రీది జిమ్ ఫిజిక్కే. నిత్యం ఎక్సర్ సైజులు చేస్తూనే ఉంటాడు. కాకపోతే సురేందర్ రెడ్డి సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయాలని భావిస్తున్నాడట చెర్రీ. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని అనుకుంటున్నారు. అంటే.. చెర్రీకి ప్రస్తుతం 2 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ 2 నెలల్లోనే రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ సాధించాలి. మరి చెర్రీ అనుకున్నది సాధిస్తాడా.. కొత్త సినిమాలో షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తాడా.. వెయిట్ అండ్ సీ..
Next Story