Telugu Global
Others

నీళ్లన్నీ సీమవాళ్లే వాడేశారు: చంద్రబాబు

చంద్రబాబు తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే రాయలసీమ నేతలు, మేధావులు గగ్గోలు పెడుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజల మనసు నొచ్చుకునేలా కామెంట్స్ చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు…ఈవెంట్ చాలా అద్భుతంగా సాగిందన్నారు. కార్యక్రమంపై ప్రజాభిప్రాయసేకరణ చేశామంటూ కొన్ని సర్వే లెక్కలను మీడియాకు వివరించారు. భోజనాలు, మంచినీటి సరఫరాలో మాత్రం అనుకున్న స్థాయిలో సేవలందించలేకపోయామని సీఎం చెప్పారు. మంచి నీటి కొరతపై […]

నీళ్లన్నీ సీమవాళ్లే వాడేశారు: చంద్రబాబు
X

చంద్రబాబు తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే రాయలసీమ నేతలు, మేధావులు గగ్గోలు పెడుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజల మనసు నొచ్చుకునేలా కామెంట్స్ చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు…ఈవెంట్ చాలా అద్భుతంగా సాగిందన్నారు. కార్యక్రమంపై ప్రజాభిప్రాయసేకరణ చేశామంటూ కొన్ని సర్వే లెక్కలను మీడియాకు వివరించారు.

భోజనాలు, మంచినీటి సరఫరాలో మాత్రం అనుకున్న స్థాయిలో సేవలందించలేకపోయామని సీఎం చెప్పారు. మంచి నీటి కొరతపై వివరణ ఇస్తూ రాయలసీమ జనంపైకి నెపం నెట్టేశారు. రాయలసీమ నుంచి వచ్చిన వారు అందరి కంటే ముందుగానే ఉదయం 9గంటలకే సభా ప్రాంగణానికి వెళ్లారని చెప్పారు. అలా ముందుగా వెళ్లిన వారు నీళ్లన్నీ వాడేశారని చంద్రబాబు చెప్పారు. తాము కూడా సరిపడ నీటిని పెట్టుకోలేకపోయామన్నారు. అందువల్లే నీటి కొరత ఏర్పడిందన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు తప్పుపడుతున్నారు. నీరు సరఫరా చేయలేక ఇలా నెపాన్ని ఒకప్రాంతం పేరు ప్రస్తావిస్తూ అక్కడి జనంపైకి నెట్టివేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు అమరావతి ఈవెంట్‌ను రాష్ట్రంలో 78 శాతం మంది ప్రత్యక్షంగాను పరోక్షంగానూ వీక్షించారంటూ కొన్ని లెక్కలు వివరించారు. దీన్ని బట్టే అమరావతి పట్ల ప్రజలు ఎంత ఎమోషన్‌కు గురవుతున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు. సభా వేదిక బాగుందని 84 శాతం మంది అభిప్రాయపడ్డారని చెప్పారు. గుంటూరు, విజయవాడ అలకంరణ బాగుందని 69 శాతం మంది చెప్పారన్నారు. భోజనాలు రుచిగా ఉన్నాయని 48 శాతం మంది, పర్వాలేదని 10 శాతం, బాగోలేదని 5 శాతం మంది చెప్పారన్నారు. 18 శాతం మంది భోజనాలు అందలేదన్నారని సర్వే లెక్కలు వివరించారు చంద్రబాబు.

First Published:  23 Oct 2015 5:57 PM IST
Next Story