గల్లాకి క్లాసు పీకిన బాబు
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాస్ పీకారు.ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని హెచ్చరించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ ప్రసంగంపై జయదేవ్ చేసిన కామెంట్సే చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యాయి. మోదీ ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంపై స్పందించిన జయదేవ్…ప్రధాని ప్రసంగం తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉండడం వల్ల తాము కేంద్రంతో పోరాటం చేయలేకపోవుతున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తామిచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ కూడా సాధ్యం కాదని తేల్చేశారు. పనిలోపనిగా అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై […]
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాస్ పీకారు.ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని హెచ్చరించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ ప్రసంగంపై జయదేవ్ చేసిన కామెంట్సే చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యాయి. మోదీ ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంపై స్పందించిన జయదేవ్…ప్రధాని ప్రసంగం తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు.
బీజేపీతో మిత్రపక్షంగా ఉండడం వల్ల తాము కేంద్రంతో పోరాటం చేయలేకపోవుతున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తామిచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ కూడా సాధ్యం కాదని తేల్చేశారు. పనిలోపనిగా అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై తనతోపాటు స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్ పేర్లను ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గల్లా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు.
వెంటనే పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు. పార్టీ లైన్ దాటి ఎలా మాట్లాడుతారని మండిపడ్డట్టు సమాచారం. శిలాఫలకంపై పేర్లను వివాదాస్పదం చేయడంపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే తాను ఏ పరిస్థితిలోఅలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో గల్లా జయదేవ్ సీఎంకు వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం.