అమరావతి టూర్... కేసీఆర్ ముందుచూపు!
ఉద్యమ సమయంలో ఆంధ్రవారిపై కేసీఆర్ కత్తులు దూశారు. తిట్టని తిట్టులేదు… పెట్టని శాపమూ లేదు. ఆంధ్ర బిర్యానీ పేడలా ఉంటుందని కూడా పదేపదే ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు, కేసీఆర్ ఉప్పునిప్పులాగే ఉంటూ వచ్చారు. ఓటుకు నోటు వ్యవహారంతో రాజకీయ వైరం కాస్త శత్రుత్వం స్థాయికి వెళ్లింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు పిలవడమే ఆలస్యం అమరావతి టూర్‌కు ఓకే చెప్పేశారు. అయితే కేసీఆర్ అమరావతి వెళ్లడం అభిమానంతో కాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. […]
ఉద్యమ సమయంలో ఆంధ్రవారిపై కేసీఆర్ కత్తులు దూశారు. తిట్టని తిట్టులేదు… పెట్టని శాపమూ లేదు. ఆంధ్ర బిర్యానీ పేడలా ఉంటుందని కూడా పదేపదే ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు, కేసీఆర్ ఉప్పునిప్పులాగే ఉంటూ వచ్చారు. ఓటుకు నోటు వ్యవహారంతో రాజకీయ వైరం కాస్త శత్రుత్వం స్థాయికి వెళ్లింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు పిలవడమే ఆలస్యం అమరావతి టూర్‌కు ఓకే చెప్పేశారు. అయితే కేసీఆర్ అమరావతి వెళ్లడం అభిమానంతో కాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ టూర్ వెనుక జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ఏరియాల్లో ఆంధ్ర ప్రజలు అత్యధికంగా ఉన్నారు. వారి మద్దతు లేకుండా కొన్ని వార్డుల్లో గెలుపు అసాధ్యం. అందుకే ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ అమరావతి బయలుదేరారని భావిస్తున్నారు. కేసీఆర్ అమరావతి టూర్ వెనుక సీక్రెట్ ఇదే అని చెబుతున్నారు. అమరావతికి వెళ్లడం ద్వారా గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన వారు టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా స్పందిస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. అదే జరిగితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు .
ఆంధ్రవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. సెటిలర్ల కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కూడా ప్రకటించారు. అయినా కేసీఆర్‌ను వారు నమ్మలేదు. కేవలం మాటలతో నమ్మించలేం అన్న నిర్దారణ వచ్చిన తర్వాతే కేసీఆర్ అమరావతి బయలు దేరారని చెబుతున్నారు.
అయితే కేసీఆర్ ఆశ అంత ఈజీగా నెరవేరుతుందా అన్నది అనుమానమే. అమరావతికి వెళ్లినంత మాత్రాన ఆంధ్ర ఓటర్లు టీఆర్ఎస్‌కు ఓటేస్తారనుకోవడం దురాశే అవుతుందని కొందరి భావన. అందులోనూ టీడీపీని తమ సొంత పార్టీ అని భావించే ఒక సామాజికవర్గం వారు ప్రాణం పోయినా టీడీపీకి తప్ప మరోపార్టీకి ఓటేయరని భావిస్తున్నారు. చూడాలి కేసీఎస్ అమరావతి ఎత్తు జీహెచ్ఎంసీ ఎన్నికలకు పనికొస్తుందో లేదో?. అయినా హైదరాబాద్‌లో ఉండే ఆంధ్ర ప్రజలకు మనస్పూర్తిగా దగ్గరవుదామని కేసీఆర్ అనుకున్నా చంద్రబాబు కానిస్తారా ఏమిటి?.