Telugu Global
National

అమితాబ్‌కు రూ. 50 వేల పెన్షన్

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ధనవంతులకు కూడా తామేమీ వ్యతిరేకం కాదని నిరూపించుకుంది. బిలియనీర్‌ అమితాబచ్చన్‌కు, ఆయన భార్య జయాబచ్చన్‌కు, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు 50 వేల రూపాయల చొప్పున పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యష్‌ భారతి అవార్డు గ్రహీతలందరికీ ఈ పింఛన్‌ స్కీమును వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అమితాబ్‌ వంటి బిలియనీర్లకే కాకుండా కవులు, కళాకారులు, సాహితీవేత్తలు… ఇలా వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్ఠులైన […]

అమితాబ్‌కు రూ. 50 వేల పెన్షన్
X

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ధనవంతులకు కూడా తామేమీ వ్యతిరేకం కాదని నిరూపించుకుంది. బిలియనీర్‌ అమితాబచ్చన్‌కు, ఆయన భార్య జయాబచ్చన్‌కు, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు 50 వేల రూపాయల చొప్పున పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యష్‌ భారతి అవార్డు గ్రహీతలందరికీ ఈ పింఛన్‌ స్కీమును వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అమితాబ్‌ వంటి బిలియనీర్లకే కాకుండా కవులు, కళాకారులు, సాహితీవేత్తలు… ఇలా వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్ఠులైన వారికి ఈ యాభై వేల రూపాయల పింఛను పథకం వర్తిస్తుందన్న మాట. యష్‌ భారతి అవార్డుకు ఎంపికైన వారికి 11 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. దీంతోపాటు మంచి జ్ఞాపికతో ఉచితరీతిన సత్కరిస్తారు. అంతటితో ఆగకుండా పింఛను స్కీము కూడా పెట్టడం కొంతమందికి నచ్చడం లేదు. లక్షలాది మంది పేదలు పింఛన్ల కోసం ఎదురు చూస్తుంటే వారిని విస్మరించి పెద్దోళ్ళకు ఈ స్కీములేంటని నిలదీస్తున్నారు కొంతమంది నాయకులు. ఈ విమర్శ ఆనోటా ఈనోటా బచ్చన్‌ కుటుంబం చెవికి చేరినట్టుంది. అందుకే వారు ఈ పింఛన్లు తమకు అవసరం లేదని… పేదవారికి ఈ మొత్తాల్ని ఖర్చు పెట్టమని సలహా ఇస్తూ తమ పెద్ద మనసును చాటుకున్నారు.

First Published:  21 Oct 2015 7:17 PM IST
Next Story