Telugu Global
Others

హిందూ పదానికి అర్థమే లేదట..!

హిందూ పదానికి అర్థమేంటి? ఇదే ఒక సామాజిక ఉద్యమకారుడు మదిలో మెదిలింది. వెంటనే గూగుల్‌ సెర్చ్‌ చేయలేదు. పుస్తకాలు తిరగేయలేదు. ప్రభుత్వం నుంచి సమాధానం కోసం సమాచారహక్కు చట్టం ద్వారా ప్రయత్నించాడు. అట్నుంచి వచ్చిన సమాధానం చదివి నోరెళ్లబెట్టాడు. హిందూ అనే పదానికి అర్థమే తమ వద్ద లేదని, హిందూ అనే దానికి ప్రత్యేక నిర్వచనం ఏమీ లేదని హోంశాఖ తరఫున సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ సమాధానం పంపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ గౌర్‌ […]

హిందూ పదానికి అర్థమే లేదట..!
X

హిందూ పదానికి అర్థమేంటి? ఇదే ఒక సామాజిక ఉద్యమకారుడు మదిలో మెదిలింది. వెంటనే గూగుల్‌ సెర్చ్‌ చేయలేదు. పుస్తకాలు తిరగేయలేదు. ప్రభుత్వం నుంచి సమాధానం కోసం సమాచారహక్కు చట్టం ద్వారా ప్రయత్నించాడు. అట్నుంచి వచ్చిన సమాధానం చదివి నోరెళ్లబెట్టాడు. హిందూ అనే పదానికి అర్థమే తమ వద్ద లేదని, హిందూ అనే దానికి ప్రత్యేక నిర్వచనం ఏమీ లేదని హోంశాఖ తరఫున సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ సమాధానం పంపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ గౌర్‌ హిందూ అంటే అర్థమేంటో తెలియజేయాలని… ఏ లక్షణాలు, ఏ అర్హతలతో ఒక వ్యక్తిని హిందువుగా పరిగణిస్తారో తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. హిందూ అనే పదానికి ప్రభుత్వంలోని ఏ శాఖ వద్దా సరైన నిర్వచనం లేదని సమాధానం రావడంతో అవాక్కయ్యాడు. హిందూ పదానికి అర్థం లేనప్పుడు హిందూ పెళ్లి, సాంప్రదాయాలు చట్టంలో ఎలా పొందుపరిచారో అర్థం కావడంలేదని గౌర్‌ ఆశ్చర్యపోతున్నాడు.

First Published:  22 Oct 2015 2:30 AM IST
Next Story