'నమో' పేరుతో బార్ ... బీజేపీ ఫైర్!
పేరుతోనే పాపులర్ అయితే పెద్ద పబ్లిసిటీ అవసరం లేదనుకున్నట్టున్నారు ఓ బార్ యజమానులు. అందుకే అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడి పేరులో సంక్షిప్త నామం తీసుకుని ‘నమో’ అన్న రెండక్షరాలతో బార్‌కు పేరు పెట్టుకున్నారు. వారు అనుకున్నట్టే మంచి పబ్లిసిటీ లభించింది. దాంతోపాటే ఒక్కసారిగా వివాదం తలెత్తింది. తమ నాయకుడి పేరు పెట్టుకుని బజార్న పడేస్తారా అంటూ బీజేపీకి చెందిన నాయకులు రోడ్డెక్కారు. తక్షణం బార్ ఎత్తివేయక పోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మద్యం, మాంసాహారం అమ్మే […]
పేరుతోనే పాపులర్ అయితే పెద్ద పబ్లిసిటీ అవసరం లేదనుకున్నట్టున్నారు ఓ బార్ యజమానులు. అందుకే అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడి పేరులో సంక్షిప్త నామం తీసుకుని ‘నమో’ అన్న రెండక్షరాలతో బార్‌కు పేరు పెట్టుకున్నారు. వారు అనుకున్నట్టే మంచి పబ్లిసిటీ లభించింది. దాంతోపాటే ఒక్కసారిగా వివాదం తలెత్తింది. తమ నాయకుడి పేరు పెట్టుకుని బజార్న పడేస్తారా అంటూ బీజేపీకి చెందిన నాయకులు రోడ్డెక్కారు. తక్షణం బార్ ఎత్తివేయక పోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మద్యం, మాంసాహారం అమ్మే బార్ అండ్ రెస్టారెంట్‌కు ‘నమో’ పేరు పెట్టడం ద్వారా తమ నాయకుడి పేరును అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని, తక్షణం దీన్ని మూసి వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తూ నాగపూర్ ఎమ్మెల్యే సమీర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు దండెత్తారు. దీంతో నాగపూర్ కలెక్టర్ జోక్యం చేసుకుని బార్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు. ఆరు నెలల తర్వాత మళ్లీ ఇదే పేరుతో దీనిని తెరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అయితే ‘నమో’ అని పేరు పెట్టుకుంటే లైసెన్స్ రద్దు చేస్తారా అంటూ ఆప్ నాయకులు కలెక్టర్‌ను నిలదీశారు. బార్ యజమాని మాత్రం మోడీ మీద ఉన్న అభిమానంతోనే ఆ పేరు పెట్టానని చెప్పుకొచ్చారు.