Telugu Global
NEWS

శ్రీమంతుడు, బాహుబలితో కేటీఆర్‌కు లింకుందా?

గ్రామాల దత్తతు కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం తర్వాతే తన తండ్రి సొంతూరును మహేష్‌బాబు దత్తతు తీసుకున్నారు. ఈ సమయంలో కేటీఆర్‌ జోక్యం చేసుకుని తెలంగాణలోనూ ఒక గ్రామాన్ని దత్తతు తీసుకునేలా మహేష్‌బాబును ఒప్పించారు. ఇంతవరకు మనందరికీ తెలుసు. కానీ శ్రీమంతుడికి, కేటీఆర్‌కు తెరవెనుక కూడా సంబంధం ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ చెబుతున్నారు. శ్రీమంతుడు చిత్రానికి తెరచాటు నిర్మాత కేటీఆరేనని మధుయాష్కి అన్నారు. అంతేకాదు బాహుబలి చిత్రానికి కేటీఆర్ […]

శ్రీమంతుడు, బాహుబలితో కేటీఆర్‌కు లింకుందా?
X

గ్రామాల దత్తతు కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం తర్వాతే తన తండ్రి సొంతూరును మహేష్‌బాబు దత్తతు తీసుకున్నారు. ఈ సమయంలో కేటీఆర్‌ జోక్యం చేసుకుని తెలంగాణలోనూ ఒక గ్రామాన్ని దత్తతు తీసుకునేలా మహేష్‌బాబును ఒప్పించారు. ఇంతవరకు మనందరికీ తెలుసు. కానీ శ్రీమంతుడికి, కేటీఆర్‌కు తెరవెనుక కూడా సంబంధం ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ చెబుతున్నారు.

శ్రీమంతుడు చిత్రానికి తెరచాటు నిర్మాత కేటీఆరేనని మధుయాష్కి అన్నారు. అంతేకాదు బాహుబలి చిత్రానికి కేటీఆర్ తెరవెనుక డిస్టిబ్యూటర్‌గా మారి బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుని కోట్లు సంపాదించారని ఆరోపించారు. అవినీతి సొమ్మే లేకపోతే ప్రత్యేక విమానాల్లో కేటీఆర్ కుటుంబంతో కలిసి విహార యాత్రలకు ఎలా వెళ్లగలుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బెత్తడుగాళ్లంతా మంత్రులైపోయారని ఎద్దేవా చేశారు. దసరా సందర్భంగా కేసీఆర్‌కు కాంగ్రెస్ తరపున దరిద్రపు ముఖ్యమంత్రిగా బిరుదు ఇస్తున్నామని యాష్కి విమర్శించారు.

First Published:  22 Oct 2015 3:33 AM IST
Next Story