సాహసమే కానీ...వృధా పోదు..!
నటుడిగా పరిచయం అయిన తరువాత అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలి. కేవలం వాణిజ్య చిత్రాలకే పరమితం అయితే.. ఒక స్టేజ్ దాటిన తరువాత.. ఫేడ్ అవుట్ కావాల్సి వస్తుంది. అదే కెరీర్ ప్రారంభంలోనే నటుడిగా డిఫరెన్స్ చూపిస్తే.. ఎప్పటికైన విజేతగా నిలిబడటం ఖాయం. మెగావారి అబ్బాయి వరుణ్ తేజ్ విషయంలో ఇదే జరుగుతుంది. తన ఫస్ట్ సినిమా ముకుంద చిత్రంతోనే అభినయానికి ప్రాధ్యాన్యంత వున్న చిత్రంతోనే పరిచయం అయ్యాడు. ఇక తన రెండో చిత్రం కంచే […]
నటుడిగా పరిచయం అయిన తరువాత అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలి. కేవలం వాణిజ్య చిత్రాలకే పరమితం అయితే.. ఒక స్టేజ్ దాటిన తరువాత.. ఫేడ్ అవుట్ కావాల్సి వస్తుంది. అదే కెరీర్ ప్రారంభంలోనే నటుడిగా డిఫరెన్స్ చూపిస్తే.. ఎప్పటికైన విజేతగా నిలిబడటం ఖాయం. మెగావారి అబ్బాయి వరుణ్ తేజ్ విషయంలో ఇదే జరుగుతుంది. తన ఫస్ట్ సినిమా ముకుంద చిత్రంతోనే అభినయానికి ప్రాధ్యాన్యంత వున్న చిత్రంతోనే పరిచయం అయ్యాడు.
ఇక తన రెండో చిత్రం కంచే . ఈ చిత్రం ఈ నెల 22న విడుదల అవుతుంది. అక్టోబర్ 2న రిలీజ్ అవుతుందని ముందుగా ఎనౌన్స్ చేశారు. కానీ.. పరిస్థితులు అనుకూలించక పోవడం తో వాయిద వేశారు. ఎట్టకేలకు పండగ బరిలో వస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి బయట పలు రకాలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎదో ప్రయోగం చేశారు. వరుణ్ తేజ్ అప్పుడే ఇటువంటి ప్రయోగాలు చేయడం అతని కెరీర్ కు మంచిది కాదని.. ఇలా పలురకాలుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఆడియో రిలీజ్ లో సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు వరుణ్ తేజ్ ను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఒక మంచి నటుడు అయ్యే లక్షణాలు వరుణ్ తేజ్ లో ఫుష్కలంగా వున్నాయన్నారు. అది నిజం.. కంచె చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో ఒక గొప్ప ఫిల్మ్ గా నిలిస్తుంది అనడంలో సందేహాం లేదు. తన రెండోవ చిత్రానికే ఇంతటి సాహసం చేయడం అనేది అతని కెరీర్ కు ప్లస్ అవుతుందే కానీ.. మైనస్ కానే కాదు. యాక్టింగ్ అనేది కేవలం కెమెరా ముందు నిలబడటం కాదు. కథలో నటుడి పాత్రను క్యారి చేయడం. ఆ సత్తా వరుణ్ తేజ్ లో ఉంది అనేది అనుభజ్ఞుల వ్యాఖ్య మరి.