అమరావతి శిలాఫలకంపై 16 పేర్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై 16 మంది పేర్లను లిఖించారు. ఈ పేర్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేరు కూడా ఉండడం ఇపుడు చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కేసీఆర్ పేరు శంకుస్థాపన శిలాఫలకంపై పెట్టడం ఎంతవరకు సమర్ధనీయమని ఓ వర్గం అంటుండగా… అసలు ఆయనే లేకపోతే ఈ అమరావతికి రాజధాని రూపం వచ్చేదా అని ప్రశ్నించేవారూ ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ పేరు కూడా ఉండడం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై 16 మంది పేర్లను లిఖించారు. ఈ పేర్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేరు కూడా ఉండడం ఇపుడు చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కేసీఆర్ పేరు శంకుస్థాపన శిలాఫలకంపై పెట్టడం ఎంతవరకు సమర్ధనీయమని ఓ వర్గం అంటుండగా… అసలు ఆయనే లేకపోతే ఈ అమరావతికి రాజధాని రూపం వచ్చేదా అని ప్రశ్నించేవారూ ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ పేరు కూడా ఉండడం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో ఎంతోమంది న్యాయమూర్తులుండగా ఆయన పేరే ఎందుకుందన్న దానికి చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టేనని సమాధానపడుతున్నారు కొంతమంది. మిగిలిన 14 పేర్లలో ప్రధాని నరేంద్రమోడి, ముగ్గురు ముఖ్యమంత్రులు… చంద్రబాబు, కేసీఆర్, ప్రకాశ్‌సింగ్ బాదల్, ముగ్గురు గవర్నర్‌లు… నరసింహన్, రోశయ్య పీబీ ఆచార్య, ఐదుగురు కేంద్ర మంత్రులు… వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, దత్రాత్రేయ, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి ఇసుకే టకాచీ, హైకోర్టు తాత్కాలిక సీజే దిలీప్ భోసలే పేర్లున్నాయి.