టైలర్ ముసుగులో టెర్రరిస్ట్
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. 2003 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన గులాం జాఫర్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుళ్ల అనంతరం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చిన జాఫర్ బేగంపేటలో తలదాచుకున్నాడు. టైలర్‌గా అందరినీ నమ్మిస్తూ జీవనం సాగిస్తున్నాడు. జాఫర్ జాడను కనిపెట్టిన గుజరాత్ ఏటీఎస్ బృందం దాడి చేసి పట్టుకుంది. గోద్రా అల్లర్ల తరువాత ప్రతీకార దాడుల కోసం జాఫర్ ఐఎస్ఐలో చేరి ఉగ్రవాదిగా మారిపోయాడు. జాఫర్ స్వస్థలం గుజరాత్ లోని […]
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. 2003 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన గులాం జాఫర్‌ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుళ్ల అనంతరం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చిన జాఫర్ బేగంపేటలో తలదాచుకున్నాడు. టైలర్‌గా అందరినీ నమ్మిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
జాఫర్ జాడను కనిపెట్టిన గుజరాత్ ఏటీఎస్ బృందం దాడి చేసి పట్టుకుంది. గోద్రా అల్లర్ల తరువాత ప్రతీకార దాడుల కోసం జాఫర్ ఐఎస్ఐలో చేరి ఉగ్రవాదిగా మారిపోయాడు. జాఫర్ స్వస్థలం గుజరాత్ లోని దరియాపూర్. ఇతడి వయసు 50 ఏళ్లు. 12 ఏళ్లుగా పోలీసులు వెంటాడుతున్నా వారికి చిక్కకుండా హైదరాబాద్‌లో తలదాచుకున్నాడు. 12 ఏళ్ల పాటు హైదరాబాద్‌లో ఉంటున్నా పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు జాఫర్‌ను గుర్తించలేకపోయాయి.