Telugu Global
Others

శంకుస్థాపనకు ఆ రెండే పెద్ద సమస్య

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు అధికారుల్లో ఆందోళన మొదలైంది. శంకుస్థాపన మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసినా.. ఇద్దరు అనుకోని అతిథులు వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళనలో అధికార యంత్రాంగం ఉంది. అధికారుల ఆందోళనకు కారణం ఒకటి ట్రాఫిక్ సమస్య కాగా, రెండో అతిథి వరుణుడు. ఇన్ని ఏర్పాట్లు చేసినా వర్షం వస్తే ఆప్రాంతమంతా చిత్తడిగా మారడం ఖాయం. దీనికి కారణం ఉద్ధండరాయుని […]

శంకుస్థాపనకు ఆ రెండే పెద్ద సమస్య
X

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు అధికారుల్లో ఆందోళన మొదలైంది. శంకుస్థాపన మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసినా.. ఇద్దరు అనుకోని అతిథులు వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళనలో అధికార యంత్రాంగం ఉంది. అధికారుల ఆందోళనకు కారణం ఒకటి ట్రాఫిక్ సమస్య కాగా, రెండో అతిథి వరుణుడు. ఇన్ని ఏర్పాట్లు చేసినా వర్షం వస్తే ఆప్రాంతమంతా చిత్తడిగా మారడం ఖాయం. దీనికి కారణం ఉద్ధండరాయుని పాలెంలోని భూములు, కొత్తగా వేసిన రోడ్లు భారీ జనసంచారానికి అనువైనవి కాదట. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సారవంతమైన నల్లరేగడి భూములు కావడంతో చిన్న వర్షం వచ్చినా చిత్తడిగా మారిపోతాయి.

మరోవైపు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా. ఈ విషయంపై సీఎం చంద్రబాబు కూడా దృష్టిసారించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీవీఐపీలు, వీఐపీల మార్గాలు మినహా మిగిలిన అన్ని రోడ్లలోనూ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి శంకుస్థాపనకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకూడదని అంతా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అధికారులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులంతా వర్షం రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

First Published:  21 Oct 2015 7:17 AM IST
Next Story