ఆంధ్రలో కేసీఆర్‌కు స్వాగత బ్యానర్లు
కేసీఆర్ అన్న పేరు వింటే ఆంధ్ర ప్రాంత నాయకులు నిద్రలో ఉన్నా లేచి గయ్యిమంటారు. అందులో టీడీపీ నేతల కోపం గురించి వేరే చెప్పాలా? అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానించడంతో టీడీపీ నేతలు కూడా తమ వైఖరి మార్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం- సుస్వాగతం అని గుంటూరు, విజయవాడల్లో స్వాగత తోరణాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రధాని […]
BY sarvi20 Oct 2015 10:25 PM GMT
X
sarvi Updated On: 20 Oct 2015 10:25 PM GMT
కేసీఆర్ అన్న పేరు వింటే ఆంధ్ర ప్రాంత నాయకులు నిద్రలో ఉన్నా లేచి గయ్యిమంటారు. అందులో టీడీపీ నేతల కోపం గురించి వేరే చెప్పాలా? అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానించడంతో టీడీపీ నేతలు కూడా తమ వైఖరి మార్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం- సుస్వాగతం అని గుంటూరు, విజయవాడల్లో స్వాగత తోరణాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యలకు కూడా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. అన్నింటికంటే.. కేసీఆర్‌కు స్వాగతం తెలుపుతూ కట్టిన బ్యానర్లపైనే ఇప్పుడు గుంటూరు, విజయవాడ ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ఆ బ్యానర్లపై తెలుగు జాతి మనది- నిండుగ వెలుగు జాతి మనది అంటూ అలనాటి ఎన్టీఆర్ చిత్రంలోని పాటనే ట్యాగ్‌లైన్‌గా వాడటం మరో విశేషం. ముఖ్యంగా విజయవాడ దుర్గమ్మ కొండపై ఈ బ్యానర్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మొక్కు చెల్లించుకోవడానికి మొదట కొండకే రానున్నారు. మొత్తానికి 14 ఏళ్ల తరువాత ఆంధ్రలో పర్యటిస్తున్న కేసీఆర్ పర్యటనకు టీడీపీ నేతలు స్వాగతం పలకడం శుభసూచకం.
Next Story