Telugu Global
Others

ఏడుపుగొట్టు సినిమాతో… అధికబరువు చిక్కులు!

ఏడుపు గొట్టు సినిమాలు, సీరియల్స్‌ని, బిక్క‌మొహం వేసుకుని వాటిలో లీన‌మైపోయి మ‌రీ చూస్తున్నారా…అయితే బరువు పెరిగిపోతారు జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. బాధామ‌య‌గాథ‌ల‌తో తెర‌కెక్కిన‌ సినిమాలు వాటిని చూస్తున్న‌పుడే కాదు, త‌రువాత కూడా మ‌న‌కొక బాధని మిగులుస్తాయి అనేది వారిమాట‌. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూస్తున్న‌పుడు కంటిముందు ఏ ఫుడ్ క‌నిపించినా తినేయాల‌నిపిస్తుంద‌ట‌. బాగా ఏడిపించే ప్రేమ కథా సినిమాని చూస్తున్నవారు, కామెడీ చిత్రాన్ని చూస్తున్నవారికంటే 28శాతం అధికంగా పాప్‌కార్న్‌ తిన్నట్టుగా ఓ అధ్యయనంలో గమనించారు. సోలారిస్ అనే విషాద సినిమాని చూసినవారు మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ […]

ఏడుపుగొట్టు సినిమాతో… అధికబరువు చిక్కులు!
X

ఏడుపు గొట్టు సినిమాలు, సీరియల్స్‌ని, బిక్క‌మొహం వేసుకుని వాటిలో లీన‌మైపోయి మ‌రీ చూస్తున్నారా…అయితే బరువు పెరిగిపోతారు జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. బాధామ‌య‌గాథ‌ల‌తో తెర‌కెక్కిన‌ సినిమాలు వాటిని చూస్తున్న‌పుడే కాదు, త‌రువాత కూడా మ‌న‌కొక బాధని మిగులుస్తాయి అనేది వారిమాట‌. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూస్తున్న‌పుడు కంటిముందు ఏ ఫుడ్ క‌నిపించినా తినేయాల‌నిపిస్తుంద‌ట‌. బాగా ఏడిపించే ప్రేమ కథా సినిమాని చూస్తున్నవారు, కామెడీ చిత్రాన్ని చూస్తున్నవారికంటే 28శాతం అధికంగా పాప్‌కార్న్‌ తిన్నట్టుగా ఓ అధ్యయనంలో గమనించారు.

సోలారిస్ అనే విషాద సినిమాని చూసినవారు మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ అనే హాస్య‌ సినిమాని చూసిన ప్రేక్షకులకంటే 55 శాతం ఎక్కువగా పాప్‌కార్న్‌ తిన్నట్టుగా… షో అనంత‌రం మిగిలిన పాప్‌కార్న్ పాకెట్ల‌ను లెక్క‌పెట్టుకుని తేల్చారు. ఇంట్లో కూర్చుని టివిల్లో ఏడిపించే సీరియ‌ల్స్‌ని ఎక్కువగా చూస్తున్న మ‌హిళ‌లు కూడా గుర్తుపెట్టుకుని తీరాల్సిన విష‌యాలు ఇవి.

అయితే ఇందులోనూ ఒక పాజిటివ్ కోణముందంటున్నారు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధకులు. ఆరోగ్యకరమైన పళ్లు, కూరగాయలు తినాలని ఉన్నా, అవంటే ఇష్టంలేక తినలేని వారు ఏ ఏడుపుగొట్టు సినిమానో చూస్తూ వాటిని తినేయవచ్చనేది వారి సలహా. యాక్షన్, సాహసోపేతమైన సినిమాలను టివిలో చూస్తున్నవారు సైతం మరింత ఎక్కువ ఆహారం తింటున్నారని, అయితే వీరు తమ చేతికి ఆహారం అందుబాటులో ఉంటేనే తింటున్నారని ఈ పరిశోధకులు చెబుతున్నారు.

దుఃఖపూరితమైన సినిమాలు చూస్తూ ఎక్కువ ఆహారం తీసుకోవడాన్ని ఎమోషనల్ ఈటింగ్‌గా చెప్పవచ్చని, సినిమాలో ఉన్న‌ విషాదం కార‌ణంగా పెరిగే ఒత్తిడిని తట్టుకోవడంలో భాగంగా వారు మ‌రింత ఎక్కువ ఆహారాన్ని తింటున్నార‌నేది పరిశోధకుల విశ్లేషణ. డిప్రెషన్లో ఉన్నవారు ఎక్కువ ఆహారం తీసుకుంటారనే నిజం ఇంతకుముందే పరిశోధనల్లో బయటపడింది. ఈ అంశాన్ని కూడా మనం అందులో భాగంగా చూడవచ్చు.

మొత్తంమీద ఈ పరిశోధకులు, ఇంట్లో టివిలో సినిమాలు చూస్తున్నప్పుడు చేతికి అందుబాటులో మాత్రం ఆహారాన్ని ఉంచుకోవద్దంటున్నారు. అలాగే మీరు తినాలనుకున్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని దగ్గరగా ఉంచుకుంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా తినేసి ప్రయోజనం పొందవచ్చని సలహా ఇస్తున్నారు.

First Published:  21 Oct 2015 6:13 AM IST
Next Story