నయనతార నిజంగానే పెళ్లి చేసుకుందా..?
తమిళ దర్శకుడు విఘ్నేష్, నయనతార చాలా క్లోజ్ గా ఉన్నారంటూ ఈమధ్య పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఓ వారం రోజుల కిందట వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలొచ్చాయి. ఓ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లిన జంట, అక్కడే ఓ రిసార్ట్ లో ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారనే పుకార్లు వ్యాపించాయి. సినిమా యూనిట్ లోని సభ్యులు కూడా ఇండైరెక్ట్ గా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేయడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. పైగా […]
BY sarvi21 Oct 2015 12:33 AM IST
X
sarvi Updated On: 21 Oct 2015 6:09 AM IST
తమిళ దర్శకుడు విఘ్నేష్, నయనతార చాలా క్లోజ్ గా ఉన్నారంటూ ఈమధ్య పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఓ వారం రోజుల కిందట వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలొచ్చాయి. ఓ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లిన జంట, అక్కడే ఓ రిసార్ట్ లో ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారనే పుకార్లు వ్యాపించాయి. సినిమా యూనిట్ లోని సభ్యులు కూడా ఇండైరెక్ట్ గా ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేయడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. పైగా దర్శకుడు విఘ్నేష్ ను ఈ విషయంపై ప్రశ్నిస్తే.. అది చాలా పర్సనల్ అంటూ తప్పించుకోవడంతో పుకార్లకు మరింత ఊతమిచ్చినట్టు అయింది. ఇంతకీ వారం రోజుల కిందట ఏం జరిగింది..? షూటింగ్ కోసం కేరళ వెళ్లిన ఆ హాట్ జంట ఓ ఇంటివారై తిరిగి చెన్నై చేరుకున్నారా..? లేక నిశ్చితార్థం లాంటి కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్నారా..? త్వరలోనే ఇద్దరూ చెన్నైలోనే పెళ్లి చేసుకోబోతున్నారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు తమిళ తంబీలను వేధిస్తున్నాయి..
Next Story