Telugu Global
NEWS

300 మందికి ఎయిడ్స్ అంటించాడు!

 విశృంఖ‌లమైన విలాసాల‌తో ప్రాణాంత‌క వ్యాధి తెచ్చుకున్న ఓ ప్ర‌బుద్ధుడు ఆ రోగాన్ని మ‌రో 300 మంది అమాయ‌క మ‌హిళ‌ల‌కు అంటించాడు. ఉప్ప‌ల్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ల్కాజిగిరిలో ఉండే జోసెఫ్ జేమ్స్ (31) ఆటోడ్రైవ‌ర్‌. ఆరేళ్ల  క్రితం వివాహ‌మైంది. అయిన‌ప్ప‌టికీ మ‌హిళ‌లంటే విప‌రీతమైన మోజు ఉన్న జోసెఫ్‌.. ఒంట‌రిగా క‌నిపించే మ‌హిళ‌ల‌పై మాట‌ల వ‌ల విసిరేవాడు. బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు త‌దిత‌ర ప్రాంతాల్లో ఇల్లు విడిచి వ‌చ్చిన మ‌హిళ‌లే ఇత‌ని ల‌క్ష్యం. వీరిని మాయ‌మాట‌ల‌తో లొంగ‌దీసుకుని త‌న […]

300 మందికి ఎయిడ్స్ అంటించాడు!
X
విశృంఖ‌లమైన విలాసాల‌తో ప్రాణాంత‌క వ్యాధి తెచ్చుకున్న ఓ ప్ర‌బుద్ధుడు ఆ రోగాన్ని మ‌రో 300 మంది అమాయ‌క మ‌హిళ‌ల‌కు అంటించాడు. ఉప్ప‌ల్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ల్కాజిగిరిలో ఉండే జోసెఫ్ జేమ్స్ (31) ఆటోడ్రైవ‌ర్‌. ఆరేళ్ల క్రితం వివాహ‌మైంది. అయిన‌ప్ప‌టికీ మ‌హిళ‌లంటే విప‌రీతమైన మోజు ఉన్న జోసెఫ్‌.. ఒంట‌రిగా క‌నిపించే మ‌హిళ‌ల‌పై మాట‌ల వ‌ల విసిరేవాడు. బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు త‌దిత‌ర ప్రాంతాల్లో ఇల్లు విడిచి వ‌చ్చిన మ‌హిళ‌లే ఇత‌ని ల‌క్ష్యం. వీరిని మాయ‌మాట‌ల‌తో లొంగ‌దీసుకుని త‌న కోరిక‌లు తీర్చుకునేవాడు. వారి షాపింగ్‌ల‌కు కావాల్సిన డ‌బ్బు కోసం చోరీలు చేసేవాడు. ఇత‌ని ఆగ‌డాలు భ‌రించ‌లేక భార్య కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా ఇత‌డి వికృత క్రీడ ఆగ‌లేదు. త‌న‌కు హెచ్ ఐ వీ ఉంద‌ని తెలిసింది. అయినా 300 మంది మ‌హిళ‌ల‌కు అత‌డు ఎయిడ్స్ అంటించాడు. ఇటీవ‌ల జ‌ల్సాల కోసం త‌న స్నేహితుని ఇంట్లోనే బంగారం దొంగిలించాడు. ఈకేసులో ఉప్ప‌ల్ పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. అక్క‌డ జోసెఫ్ చెప్పిన వాస్త‌వాలు విని పోలీసుల‌కే క‌ళ్లు తిరిగాయి. అత‌ని ఫోన్‌లో దాదాపు 150పైగా మ‌హిళ‌ల ఫోన్ నెంబ‌ర్ల‌ను పోలీసులు గుర్తించారు.
First Published:  20 Oct 2015 11:37 PM IST
Next Story